SBI Results: అదరకొట్టిన ఎస్‌బీఐ.. Q1 ఫలితాల్లో రెండితలపైగా లాభం

SBI Q1 Results: ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసిక ఫలితాల్లో రూ.16,884 కోట్లతో రెండింతలపైగా లాభాన్ని నమోదు చేసుకుంది.

Updated : 04 Aug 2023 19:11 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) మొదటి త్రైమాసిక ఫలితాలను (Q1 Results) శుక్రవారం ప్రకటించింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రెండింతలకు పైగా లాభాన్ని నమోదు చేసింది. స్టాండ్‌లోన్‌ పద్ధతిలో రూ.16,884 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదు చేసుకున్న రూ.6,068 కోట్లతో పోలిస్తే లాభం 178 శాతం వృద్ధి నమోదైంది. బ్యాడ్‌ లోన్స్‌ తగ్గడం, వడ్డీ ఆదాయం మెరుగవ్వడం ఇందుకు దోహదం చేశాయి.

నిషేధం ఉన్న వేళ విదేశాల నుంచి ల్యాప్‌టాప్స్‌ కొనొచ్చా..?

ఇక సమీక్షా త్రైమాసికంలో బ్యాంక్‌ మొత్తం ఆదాయం రూ.1,08,039  కోట్లకు పెరిగిందని ఎస్‌బీఐ తెలిపింది. గతేడాది ఇదే సమయంలో రూ.74,989 కోట్లుగా ఉందని బ్యాంక్‌ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. వడ్డీ ద్వారా వచ్చే ఆదాయం రూ.72,676 కోట్ల నుంచి రూ.95,975 కోట్లకు చేరింది. స్థూల నిరర్థక ఆస్తులు (NPA) 3.91 శాతం నుంచి 2.76 శాతానికి తగ్గాయి. నికర నిరర్థక ఆస్తులు ఒక శాతం నుంచి 0.71 శాతానికి తగ్గాయి. ఇక ఏకీకృత ప్రాతిపదికన నికర లాభం రూ.7,325 కోట్ల నుంచి రూ.18,537 కోట్లకు చేరింది. అలాగే మొత్తం ఆదాయం రూ.94,524 కోట్ల నుంచి రూ.1,32,333 కోట్లకు పెరిగింది. ఫలితాల నేపథ్యంలో ఎస్‌బీఐ షేరు విలువ శుక్రవారం ఎన్‌ఎస్‌ఈలో 2.93 శాతం మేర క్షీణించి రూ.573.20 వద్ద స్థిరపడింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని