Laptops: నిషేధం ఉన్న వేళ విదేశాల నుంచి ల్యాప్‌టాప్స్‌ కొనొచ్చా..?

Restrictions on imports: కేంద్రం విధించిన ఆంక్షలు అమల్లోకి వచ్చిన వేళ విదేశాల నుంచి ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, పర్సనల్ కంప్యూటర్లను కొనే అవకాశం ఉందా?

Updated : 04 Aug 2023 15:13 IST

దిల్లీ: విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే ల్యాప్‌టాప్‌లు (Laptops), ట్యాబ్లెట్లు (Tablets), పర్సనల్‌ కంప్యూటర్ల (Personal Computers)పై కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలు ఇప్పటికే అమలులోకి వచ్చాయి. భద్రతా కారణాలతో పాటు దేశీయ తయారీని ప్రోత్సహించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం పేర్కొంది. అయితే దిగుమతుల్లో కొన్ని మినహాయింపులు ఇచ్చింది. సరైన అనుమతులు ఉంటే వాటిని దిగుమతి చేసుకునేందుకు వీలు కల్పించనున్నట్లు తెలిపింది. అయితే విదేశాల నుంచి ఈ పరికరాల దిగుమతి నిజంగా సాధ్యమా? ఒక వేల సాధ్యమైతే ఎవరు దిగుమతి చేసుకోవచ్చో చూద్దాం.

విదేశాల నుంచి భారత్‌కు వచ్చే వారు ల్యాప్‌టాప్‌, ట్యాబ్లెట్లు, పర్సనల్ కంప్యూటర్‌ను ఎటువంటి ఆంక్షలు లేకుండా తీసుకురావచ్చు. అయితే విదేశాల్లోనే వీటిని కొనుగోలు చేసినట్లు కస్టమ్స్ వద్ద సరైన ధ్రువపత్రాలు చూపించాల్సి ఉంటుంది. అంతే కాకుండా ఈ-కామర్స్ పోర్టల్స్‌ నుంచి కొనుగోలు చేసి పోస్ట్ లేదా కొరియర్ ద్వారా వీటిని దిగుమతి చేసుకొనే వారికి ఈ మినహాయింపు వర్తిస్తుంది.

దిగుమతులపై ఆంక్షలు.. ల్యాప్‌టాప్‌ల ధరలకు రెక్కలు..?

రీసర్చ్‌, టెస్టింగ్‌, ఎవాల్యుయేషన్, రిపెయిర్‌, రీ-ఎక్స్‌పోర్ట్ తో పాటు ప్రాడెక్ట్ డెవలప్‌మెంట్‌లో భాగంగా ల్యాప్‌టాప్‌, ట్యాబ్లెట్లు, పర్సనల్‌ కంప్యూటర్లను దిగుమతి చేసుకోవాలనుకొనే వారిపై కూడా ఈ ఆంక్షలు వర్తించవు. అయితే వీరు ఒక్కో రవాణాకు గరిష్టంగా 20 వస్తువుల వరకు దిగుమతి చేసుకొనేందుకు అనుమతి ఉంటుంది. వ్యక్తిగత అవసరాలకోసం లేదా బహుమతి అందిచటానికి అయితే వీటిని విదేశాలనుంచి దిగుమతి చేసుకోవచ్చు. దిగుమతి సమయంలో వీటిపై కస్టం డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే వీటిని ఎట్టిపరిస్థితుల్లో విక్రయించకూడదు. ఇలా దిగుమతి చేసుకున్న ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లను పనిపూర్తయిన తర్వాత ధ్వంసం చేయాలి. లేదా విదేశాలకు తిరిగి ఎగుమతి చేయాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని