Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. నిఫ్టీ @ 22,100

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 526.02 పాయింట్లు, నిఫ్టీ 143.25 పాయింట్లు పెరిగాయి.

Published : 27 Mar 2024 16:04 IST

Stock Market Closing bell | ముంబయి: దేశీయ మార్కెట్‌ సూచీలు (Stock market) లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లలోని సానుకూల సంకేతాలతో ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు.. రోజంతా అదేబాటలో పయనించాయి. ముఖ్యంగా అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లలో మదుపరులు పెట్టుబడులు పెట్టడం మార్కెట్‌కు కలిసొచ్చింది. 

సెన్సెక్స్‌ ఉదయం 72,692.16 పాయింట్ల వద్ద లాభంతో ప్రారంభమైంది. ఆద్యంతం అదే ఉత్సాహాన్ని కొనసాగించింది. ఇంట్రాడేలో 73,138.73 గరిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరకు 526.02 పాయింట్ల లాభంతో 72,996.31 వద్ద ముగిసింది. నిఫ్టీ 143.25 పాయింట్ల లాభంతో 22,147.95 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.37గా ఉంది.

రెండేళ్లలో 151 నుంచి 80 కిలోలకు.. కంపెనీ సీఈఓ ఇన్‌స్పైరింగ్‌ స్టోరీ

సెన్సెక్స్‌ 30 సూచీలో రిలయన్స్‌, మారుతీ, బజాజ్‌ ఫైనాన్స్‌, టైటాన్‌, కోటక్‌ మహీంద్రా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎల్‌ అండ్‌ టీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎం అండ్‌ ఎం, యాక్సిస్‌ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టీసీఎస్‌, ఎస్‌బీఐ, నెస్లే ఇండియా, టాటా మోటార్స్‌, ఇన్ఫీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 85.63 వద్ద, బంగారం ఔన్సు ధర 2,209 డాలర్ల వద్ద ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని