స్విగ్గీ- హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ క్యాష్‌బ్యాక్‌లో మార్పులు

Swiggy- HDFC Bank Credit: ప్రముఖ బ్యాంక్‌ హెచ్‌డీఎఫ్‌సీ తాను అందిస్తున్న కో బ్రాండ్ క్రెడిట్‌ కార్డు ప్రయోజనాల్లో మార్పు తీసుకొచ్చింది.

Published : 23 May 2024 19:49 IST

Swiggy- HDFC Bank Credit | ఇంటర్నెట్‌డెస్క్‌: క్రెడిట్‌ కార్డులపై ప్రయోజనాల్లో మార్పులు తీసుకురానున్నట్లు ఇప్పటికే అనేక బ్యాంకులు, కార్డు జారీ సంస్థలు ప్రకటించాయి. తాజాగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కూడా అదే జాబితాలో చేరింది. స్విగ్గీతో కలసి అందిస్తున్న కో బ్రాండెండ్‌ క్రెడిట్‌ కార్డు ప్రయోజనాల్లో మార్పులు తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఇప్పటివరకు అందిస్తున్న క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లను అప్‌డేట్‌ చేసినట్లు పేర్కొంది. ఈ కొత్త మార్పులు జూన్‌ 21 నుంచి అమల్లోకి రానున్నాయి.

ఇప్పటివరకు స్విగ్గీలో చేసే కొనుగోళ్లపై వచ్చే క్యాష్‌బ్యాక్‌ స్విగ్గీ మనీ వాలెట్‌లో జమయ్యేది. ఇకపై ఆ సదుపాయం ఉండదు. ఆ క్యాష్‌బ్యాక్‌ క్రెడిట్‌ కార్డ్‌ అకౌంట్లో కనిపించనుంది. జూన్‌ 20 వరకు మాత్రం స్విగ్గీ మనీలోనే క్యాష్‌బ్యాక్‌ డిపాజిట్ అవుతాయి. కార్డ్‌ స్టేట్‌మెంట్‌ జనరేట్‌ అయిన 10 రోజుల తర్వాత క్యాష్‌బ్యాక్‌ క్రెడిట్‌ అయ్యేది. జూన్‌ 20 తర్వాత ఈ పద్ధతి మారనుంది. కార్డ్ స్టేట్‌మెంట్‌ ప్రతినెలా 15వ తేదీ జనరేట్‌ అవుతుంటే తరువాతి నెలలో ఆ క్యాష్‌బ్యాక్‌ కనిపిస్తుంది. ఉదాహరణకు.. జులై 15 నుంచి ఆగస్టు 14 మధ్య సంపాదించిన క్యాష్‌బ్యాక్‌ ఆగస్టు స్టేట్‌మెంట్‌లో కనిపిస్తుంది. అంటే ఆ మేర తగ్గించి మిగిలిన మొత్తం చెల్లించుకోవచ్చు.

గూగుల్‌పేలో బై నౌ పే లేటర్‌.. కార్డు వివరాలు మరింత సేఫ్‌

ఇక ఈ కార్డు విషయానికొస్తే.. స్విగ్గీ- హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ (Swiggy- HDFC Bank Credit) క్రెడిట్‌ కార్డు ద్వారా చేసే ఆన్‌లైన్‌ కొనుగోళ్లపై 5 శాతం క్యాష్‌బ్యాక్‌, స్విగ్గీలో కొనుగోళ్లపై 10 శాతం క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది. ఆ కార్డుతో చేసే ఆఫ్‌లైన్ చెల్లింపులపై కూడా క్యాష్‌బ్యాక్‌ పొందొచ్చు. కార్డ్ యాక్టివేట్‌ అయిన తర్వాత 3 నెలల పాటు వెల్‌కమ్‌ ఆఫర్‌ కింద స్విగ్గీ వన్‌ సభ్యత్వం ఇస్తోంది. కార్డు జాయినింగ్‌ ఫీ, పునరుద్ధరణ రుసుము రూ.500. ఏడాదిలో రూ.2 లక్షలకు పైగా ఖర్చు చేస్తే రెన్యువల్‌ ఫీ ఉండదు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని