Swiggy: స్విగ్గీలో కొత్త సేవలు.. తప్పిపోయిన పెట్స్‌నూ కనిపెడతారు!

Swiggy: జంతు ప్రియుల కోసం స్విగ్గీ ‘‘Swiggy Pawlice’’ పేరిట కొత్త తరహా సేవల్ని తీసుకొచ్చింది. 

Published : 12 Apr 2024 17:27 IST

Swiggy | దిల్లీ: ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ స్విగ్గీ (Swiggy) కొత్త తరహా సేవల్ని ప్రారంభించింది. ఇప్పటివరకు కేవలం ఫుడ్‌ ఆర్డర్లు, నిత్యావసర సరకుల డెలివరీలకే పరిమితమైన సంస్థ తాజాగా.. జంతుప్రియుల కోసం ‘‘స్విగ్గీ పాలీస్‌ (Swiggy Pawlice)’’ పేరిట కొత్త సర్వీసులను తీసుకొచ్చింది. తప్పిపోయిన పెట్స్‌ను వెతికి తెచ్చేందుకు ఈ సేవల్ని పరిచయం చేసినట్లు పేర్కొంది.

స్విగ్గీ తీసుకొచ్చిన కొత్త సేవల ద్వారా తప్పిపోయిన జంతువుకు సంబంధించిన వివరాలు, ఫొటోలతో యాప్‌లో ఫిర్యాదు చేయొచ్చు. సంస్థకు చెందిన డెలివరీ భాగస్వాములు తప్పిపోయిన జంతువులను గుర్తించి వాటి వివరాలు, లొకేషన్‌ను స్విగ్గి టీమ్‌కు తెలియజేస్తారు. వెంటనే ఆ అప్‌డేట్‌ను పెట్‌ పేరెంట్స్‌కు తెలుపుతారు. ఇలా స్విగ్గీ డెలివరీ పార్ట్‌నర్స్‌ సాయంతో పెట్‌ను కనిపెట్టేస్తారు. 

ఆ స్టాక్‌ రికమండేషన్లు నావి కావు.. ఇన్వెస్టర్లకు నిఖిల్‌ కామత్‌ అలర్ట్‌!

ఏప్రిల్ 11న జాతీయ పెంపుడు జంతువుల దినోత్సవం సందర్భంగా ఈ సదుపాయాన్ని ప్రారంభించింది. టాటా ట్రస్ట్స్ జనరల్ మేనేజర్ శంతను నాయుడు, హౌస్ ఆఫ్ ఛైర్మన్ సమక్షంలో ఈ సేవల్ని పరిచయం చేసింది. 3.5 లక్షల మంది డెలివరీ భాగస్వాములు ఈ సేవల్ని అందించడంలో సాయపడతారని స్విగ్గీ ఫుడ్ మార్కెట్‌ప్లేస్ సీఈఓ రోహిత్ కపూర్ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని