Tata Motors: టాటా మోటార్స్‌ ఫలితాలు ఆకర్షణీయం

Tata Motors Q1 Results: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్‌ జూన్‌తో ముగిసిన త్రైమాసిక ఫలితాల్లో రూ.3,300.65 కోట్ల నికర లాభాన్ని నమోదుచేసుకుంది.

Updated : 26 Jul 2023 00:13 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్‌ (Tata Motors) మొదటి త్రైమాసిక ఫలితాలను మంగళవారం ప్రకటించింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.3,300.65 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.5,007 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. 

గోవాలో ఉబర్‌కు షాక్‌.. ప్రభుత్వం పోలీస్‌ కేసు

ఆదాయంలో 42శాతం పెరిగినట్లు టాటా మోటార్స్ తెలిపింది.  గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.71,227.76 కోట్లుగా ఉండేది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఆదాయం రూ.1,01,528.49 కోట్లకు చేరింది. ఇక ఖర్చుల విషయానికొస్తే... గతేడాది ఇదే సమయంలో రూ.77,783.69 కోట్లుగా ఉన్న ఖర్చులు రూ.98,266.93 కోట్లకు చేరాయని కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. వాణిజ్య వాహనాల ద్వారా వచ్చే ఆదాయం 4.4శాతం పెరిగి రూ.17,000 కోట్లకు చేరింది. దేశీయంగా టోకు అమ్మకాల్లో 14.4శాతం క్షీణతను నమోదుచేసుకుంది. ఇక ప్రయాణికుల వాహనాల ద్వారా వచ్చే ఆదాయం 11 శాతం పెరగ్గా.. దేశీయంగా జరిగే టోకు విక్రయాలు 7.5శాతం పెరిగాయని కంపెనీ తెలిపింది. ఈ రోజు మార్కెట్ ముగిసే సమయానికి టాటా మోటార్స్ షేరు విలువ 1.99శాతం పెరిగి రూ.641.80కు చేరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని