Tata Play: టాటా ప్లేతో అమెజాన్‌ జట్టు.. ఇక DTHలోనూ ప్రైమ్‌ వీడియో

Tata Play: డీటీహెచ్‌ కస్టమర్లకు సైతం ఓటీటీ ప్రయోజనాలను అందించేందుకు టాటా ప్లే సిద్ధమైంది. అందుకోసం అమెజాన్‌ ప్రైమ్‌తో చేతులు కలిపింది.

Updated : 14 May 2024 16:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కంటెంట్‌ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ టాటా ప్లే (Tata Play) అమెజాన్‌ ప్రైమ్‌తో చేతులు కలిపింది. తమ డీటీహెచ్‌, బింజ్ కస్టమర్లకు ప్రైమ్‌ వీడియో (Amazon Prime Video) ప్రయోజనాలను అందించనుంది. దీంతో వివిధ ప్యాక్‌లతో సబ్‌స్క్రైబర్లు ఇటు టీవీ ఛానెళ్లతో పాటు ప్రైమ్‌ లైట్ కంటెంట్‌ను వీక్షించొచ్చు.

ఇకపై టాటా ప్లే డీటీహెచ్‌ సబ్‌స్క్రైబర్లు నెలకు రూ.199తో ప్రారంభమయ్యే ఏ ప్యాక్‌నైనా ఎంచుకోవచ్చు. దీంతో వివిధ రకాల టీవీ ఛానెళ్లతో పాటు ప్రైమ్‌ లైట్‌ కంటెంట్‌ లభిస్తుంది. అదే బింజ్‌ చందాదారులు ప్రైమ్‌ లైట్‌తో కలిపి 30కి పైగా ఓటీటీ యాప్‌లను ఎంచుకోవచ్చు. ప్రైమ్‌ వీడియో (Prime Video) కలిపి ఆరు ఓటీటీలను ఎంచుకుంటే నెలకు రూ.199 చెల్లించాల్సి వస్తుంది. అదే 33 యాప్‌లు కావాలనుకుంటే రూ.349 చెల్లించాలి. కొత్త ప్లాన్లలో నచ్చిన ఓటీటీలను ఎంచుకునే వెసుబాటు ఇచ్చారు.

టాటా ప్లేలో ప్రైమ్‌ లైట్‌తో (Prime Lite) కూడిన ప్యాకేజీలు ఎంచుకున్నవారికి వీడియో కంటెంట్‌తో పాటు అమెజాన్‌ ఈకామర్స్‌ షిప్పింగ్‌, షాపింగ్‌ ప్రయోజనాలు కూడా అందుతాయి. ఆర్డర్‌ చేసిన రోజు లేదా తర్వాత రోజు డెలివరీ, ప్రత్యేక సందర్భాల్లో నిర్వహించే సేల్‌లో ముందుగానే పాల్గొనే అవకాశం లభిస్తుంది. మరోవైపు కొత్త ప్లాన్లతో పాటు టాటా ప్లే డీటీహెచ్‌ కస్టమర్లు అమెజాన్‌ ప్రైమ్‌ వార్షిక సబ్‌స్క్రిప్షన్‌ను రాయితీ ధరతో పొందొచ్చు. వారికి షిప్పింగ్‌, షాపింగ్‌, అమెజాన్‌ మ్యూజిక్‌, ప్రైమ్‌ రీడింగ్‌, ప్రైమ్‌ గేమింగ్‌ ప్రయోజనాలు సహా ఐదు స్క్రీన్లపై ప్రైమ్‌ వీడియో కంటెంట్‌ను వీక్షించే అవకాశం లభిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు