Tech Mahindra: టెక్‌ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్‌

Tech Mahindra: ప్రముఖ ఐటీ సేవల సంస్థ టెక్‌ మహీంద్రా మార్చితో ముగిసిన మూడో త్రైమాసిక ఫలితాల్ని ప్రకటించింది. లాభంలో భారీ క్షీణతను నమోదు చేసుకుంది.

Published : 25 Apr 2024 20:18 IST

Tech Mahindra Q4 Results | దిల్లీ: ప్రముఖ ఐటీ సంస్థ టెక్‌ మహీంద్రా (Tech Mahindra) మార్చితో ముగిసిన చివరి త్రైమాసిక ఫలితాలను (Q4 results) గురువారం ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే కంపెనీ నికర లాభంలో భారీ క్షీణత నమోదైంది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం 41 శాతం తగ్గి రూ.661 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.1,117.7 కోట్లుగా ఉంది. కంపెనీ ఆదాయం 6.2 శాతం కుంగి రూ.12,871 కోట్లకు పరిమితమైంది.

ఐసీఐసీఐ, యెస్‌ బ్యాంక్‌లో మే 1 నుంచి కొత్త సర్వీస్‌ ఛార్జీలు!

2023 ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా చూస్తే కంపెనీ ఏకీకృత నికర లాభం 51.2 శాతం తగ్గి రూ.2,358 కోట్లకు చేరింది. ఆదాయం 2.4 శాతం కుంగి రూ.51,996 కోట్లుగా నమోదైంది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ 795 మంది ఉద్యోగులను తొలగించింది. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,45,455కు చేరింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి డివిడెండ్‌గా రూ.5 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.28 తుది డివిడెండ్‌ ఇవ్వాలని కంపెనీ బోర్డుకు సిఫార్సు చేసింది. 2023 నవంబరులో కంపెనీ చెల్లించిన రూ.12 మధ్యంతర డివిడెండ్‌కు ఇది అదనం. త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు విలువ ఎన్‌ఎస్‌ఈలో 0.43 శాతం పెరిగి రూ.1,190.75 వద్ద స్థిరపడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని