Fraud calls: స్కామ్‌ కాల్స్‌కు 10 అంకెల పరిష్కారం

Fraud calls: వివిధ సంస్థల పేరిట స్కామ్‌ కాల్స్‌ పెరుగుతున్న విషయం తెలిసిందే. వీటికి చెక్‌ పెట్టేందుకు టెలికాం విభాగం కొత్త విధానంతో ముందుకొచ్చింది.

Published : 29 May 2024 14:45 IST

దిల్లీ: స్కామ్‌ కాల్స్ (Fraud calls) పెరుగుతున్న నేపథ్యంలో భారత టెలికాం విభాగం (DoT) కొత్త పరిష్కారంతో ముందుకొచ్చింది. నకిలీ కాల్స్‌ను గుర్తించేలా కొత్త వ్యవస్థను రూపొందించింది. 160తో ప్రారంభమయ్యే 10 అంకెల నెంబర్‌ సిరీస్‌ను తీసుకొచ్చింది. ఇకపై ప్రభుత్వ, నియంత్రణ, ఆర్థిక సంస్థల నుంచి వచ్చే కాల్స్‌కు ముందు ఈ నెంబర్‌ ఉండనుంది.

పది అంకెల నెంబర్‌ 160 ప్రిఫిక్స్‌తో పాటు 1600ABCXXX ఫార్మాట్‌లో ఉంటుంది. ప్రభుత్వ, ఆర్థిక సంస్థలతో పాటు టెలికాం నియంత్రణా సంస్థల నుంచి వచ్చే కాల్స్‌కు ఇది వర్తిస్తుంది. ఈ ఫార్మాట్‌లో ‘AB’ స్థానంలో టెలికాం సర్కిల్‌ కోడ్‌ ఉదాహరణకు దిల్లీ అయితే 11, ముంబయికి 22 ఉంటుంది. ‘C’ స్థానంలోని అంకె టెలికాం ఆపరేటర్‌ కోడ్‌ను సూచిస్తుంది. XXX ప్లేస్‌లో 000-999 మధ్య నెంబర్లు ఉంటాయి.

పెరుగుతున్న వాట్సప్‌ గ్రూపు స్కామ్స్‌.. లాభాలంటూ వెళితే అంతే!

ఆర్‌బీఐ, సెబీ, పీఎఫ్‌ఆర్‌డీఏ, ఐఆర్‌డీఏ వంటి నియంత్రణా సంస్థల పరిధిలో ఉండే కంపెనీల నుంచి 1601ABCXXX ఫార్మాట్‌తో గల పది అంకెల సంఖ్య నుంచి ఫోన్‌ కాల్స్‌ వస్తాయి. ఈ కొత్త విధానం వల్ల యూజర్లకు కాల్స్‌ ఎక్కడి నుంచి వస్తున్నాయో ముందే పసిగట్టే అవకాశం ఉంటుంది. 160 సిరీస్‌తో కూడిన నెంబర్లను జారీ చేసే ముందు ‘టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్లు (TSP)’ ఆయా సంస్థలను క్షుణ్నంగా తనిఖీ చేసి ధ్రువీకరించుకోవాలని డీవోటీ సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని