Tesla Shares: ట్రంప్‌తో మస్క్‌ కటీఫ్‌.. టెస్లాకు రూ.13 లక్షల కోట్ల నష్టం

Eenadu icon
By Business News Team Updated : 06 Jun 2025 08:26 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ బంధం దారుణంగా చెడింది. ఇటీవల డోజ్ శాఖ నుంచి వైదొలిగిన మస్క్‌.. అధ్యక్షుడి (Donald Trump)పై బహిరంగంగానే సంచలన ఆరోపణలు చేస్తున్నారు. అటు ట్రంప్‌ కూడా టెస్లా (Tesla) అధినేతకు గట్టిగానే వార్నింగ్‌ ఇస్తున్నారు. ఈ పరిణామాలు మస్క్‌ (Elon Musk) కంపెనీపై తీవ్ర ప్రభావం చూపించాయి. ఈ సంస్థ షేర్లు దారుణంగా పతనమయ్యాయి. దాదాపు 152 బిలియన్‌ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ.13 లక్షల కోట్లు) సంపద ఆవిరైంది.

మస్క్‌-ట్రంప్‌ (Musk-Trump Dispute) విబేధాల నేపథ్యంలో గురువారం నాటి ట్రేడింగ్‌లో టెస్లా షేర్లు ఏకంగా 14శాతం మేర కుంగాయి. దీంతో కంపెనీ మార్కెట్‌ విలువ 1 ట్రిలియన్‌ మార్క్‌ను కోల్పోయి 916 బిలియన్‌ డాలర్లకు పడిపోయింది. టెస్లా సంపద ఒక్క రోజులోనే ఈ స్థాయిలో తరిగిపోవడం సంస్థ చరిత్రలోనే ఇదే తొలిసారి కావడం గమనార్హం.

తన మద్దతు లేకుంటే 2024 అమెరికా ఎన్నికల్లో ట్రంప్, రిపబ్లికన్‌ పార్టీ నేతలు ఓటమి పాలయ్యేవారని మస్క్‌ వ్యాఖ్యానించారు. అంతేనా.. సెక్స్‌ కుంభకోణంలో నిందితుడు జెఫ్రీ ఎప్‌స్టైన్‌తో అధ్యక్షుడికి సంబంధాలు ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారు. ఆయనను అభిశంసించాలని అన్నారు. దీనిపై ట్రంప్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన వ్యాపారాలకు ప్రభుత్వ కాంట్రాక్టులను రద్దు చేస్తానని హెచ్చరించారు. ‘‘మస్క్‌ అంత ప్రభావవంతమైన వ్యక్తి కాదు. దేశంలోని ప్రతిఒక్కరూ బలవంతంగా విద్యుత్‌ వాహనాలు కొనుగోలు చేసేలా ఆయన ఒత్తిడి చేయాలనుకుంటున్నారు. దానికి నేను అంగీకరించలేదు. వెళ్లిపొమ్మని చెప్పా. అందుకే ఆయన ఇలా పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు’’ అని ట్రంప్‌ సోషల్‌ మీడియాలో రాసుకొచ్చారు.

Tags :
Published : 06 Jun 2025 08:14 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు