ఎయిర్‌లైన్స్‌ లాభాల్లో బిగ్‌ జంప్‌.. ఉద్యోగులకు 8 నెలల జీతం బోనస్‌..

అంచనాలకు మించి లాభాలు నమోదు చేయడంతో సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ తన ఉద్యోగులకు 8 నెలల జీతాన్ని బోనస్‌గా అందిస్తున్నట్లు ప్రకటించింది.

Published : 19 May 2024 15:39 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ విమానయాన సంస్థ సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ (Singapore Airlines) రికార్డు స్థాయిలో లాభాలు నమోదు చేసింది. అంచనాలకు మించి లాభాలు నమోదు చేయడంతో తన సిబ్బందికి బంపర్‌ ఆఫర్‌ అందించాలని నిర్ణయించింది. ఎనిమిది నెలల జీతాన్ని బోనస్‌గా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. 

కరోనా మహమ్మారి కారణంగా దాదాపుగా అన్ని ఎయిర్‌లైన్‌ సంస్థలు నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత పరిస్థితులు అనుకూలించి.. చైనా, హాంకాంగ్‌, జపాన్‌, తైవాన్‌ దేశాల సరిహద్దులు పూర్తిగా తెరచుకోవడమే తిరిగి సంస్థ లాభాల బాట పట్టడానికి కారణం అని సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ తెలిపింది. 2023- 24 ఆర్థిక సంవత్సరంలో విమానయాన సంస్థ రికార్డు స్థాయిలో 1.98 బిలియన్‌ డాలర్ల వార్షిక నికర లాభాన్ని నమోదు చేసింది. దీంతో మార్చి ముగిసే సమయానికి ఎయిర్‌లైన్‌ నికర ఆదాయం 24 శాతం పెరిగి 2.7 బిలియన్‌ డాలర్లకు చేరింది.

అందుకే భారత్‌తో వాణిజ్య బంధం తెగిపోయింది: పాక్‌

ప్యాసింజర్లకు సౌకర్యవంతమైన ప్రయాణ వసతుల్ని కల్పించడంతో పాటు తమ ఉద్యోగుల మెరుగైన పనితీరే ఈ వృద్ధికి కారణమని కంపెనీ పేర్కొంది. అందుకే లాభాల్లో కొంత భాగాన్ని ఉద్యోగులకు బోనస్‌ రూపంలో చెల్లించనున్నట్లు సంస్థ ప్రకటించింది. గత సంవత్సరంలో ఏకంగా 36.4 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలు అందించినట్లు తెలిపింది. ఇలా కంపెనీ ఆర్జించిన లాభాలను బోనస్‌ రూపంలో ఉద్యోగులకు ఇవ్వడం ఇదేం తొలిసారి కాదు. గతంలో దుబాయ్‌ ఎమిరేట్స్‌ కూడా ఇలానే 20 వారాల జీతాన్ని బోనస్‌గా అందించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు