Pakistan: అందుకే భారత్‌తో వాణిజ్య బంధం తెగిపోయింది: పాక్‌

Pakistan: పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్‌-పాక్‌ మధ్య సంబంధాలు క్షీణించిన విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య వాణిజ్యం సైతం దెబ్బతింది. తాజాగా దీనిపై ఆ దేశ విదేశాంగ మంత్రి స్పందించారు.

Updated : 19 May 2024 17:07 IST

Pakistan | ఇస్లామాబాద్‌: పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాక్ (Pakistan) దిగుమతులపై భారత్‌ అధిక సుంకాలు విధించడం ప్రారంభించిందని ఆ దేశ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్‌ దర్‌ తెలిపారు. అందుకే ఇరు దేశాల మధ్య వాణిజ్య బంధం నిలిచిపోయిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆ దేశ నేషనల్‌ అసెంబ్లీకి శనివారం ఆయన రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

‘‘పుల్వామా ఘటన తర్వాత పాక్‌ (Pakistan) నుంచి వచ్చే దిగుమతులుపై 200 శాతం సుంకం విధించాలని భారత్‌ నిర్ణయించింది. కశ్మీర్‌ బస్సు సేవలను నిలిపివేసింది. సరిహద్దు వెంట వాణిజ్య కార్యకలాపాలను ఆపేసింది’’ అని ఇషాక్‌ పేర్కొన్నారు. భారత్‌ సహా పొరుగు దేశాలతో పాక్‌ ఎదుర్కొంటున్న సవాళ్లేంటని ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు ఆయన పై విధంగా సమాధానం ఇచ్చారు. భారత్‌తో వాణిజ్య సంబంధాలను పునరుద్ధరణ విషయంలో పాక్‌ (Pakistan) వ్యాపార వర్గాలు ఆతృతగా ఉన్నాయని మార్చిలో లండన్‌లో జరిగిన ఓ సమావేశంలో ఇషాక్‌ అన్నారు. అనంతరం భారత్‌తో వాణిజ్యాన్ని పునరుద్ధరించే ప్రణాళికలేవీ లేవని ఆయన కార్యాలయం మరో ప్రకటన విడుదల చేయడం గమనార్హం.

కిర్గిజ్‌స్థాన్లో విదేశీ విద్యార్థులపై మూకదాడులు

పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్‌-పాక్‌ సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే విధానానికి స్వస్తి పలకాలని భారత్‌ డిమాండ్‌ చేస్తోంది. తద్వారా ఇతర సమస్యల పరిష్కారానికి సానుకూల వాతావరణాన్ని కల్పించే బాధ్యత పాక్‌పైనే ఉందని స్పష్టం చేస్తూ వస్తోంది. దాయాది దేశం మాత్రం ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి నిర్మాణాత్మక చర్యలు తీసుకోవడం లేదు. పైగా తమ భూభాగం నుంచి ఉగ్రకార్యకలాపాలు కొనసాగడం లేదంటూ వితండవాదం చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని