OnePlus 11 5G: ఈ వన్‌ప్లస్‌ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌పై రూ.5,000 తగ్గింపు!

OnePlus 11 5G: వన్‌ప్లస్‌ 11 5జీ ధరను కంపెనీ మరింత తగ్గించింది. ఈ ఫోన్‌ ఫీచర్లు, అదనపు డిస్కౌంట్లు, కొత్త ధర వంటి వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం..!

Updated : 16 Apr 2024 11:01 IST

బెంగళూరు: ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ వన్‌ప్లస్‌ 11 5జీని (OnePlus 11 5G) కంపెనీ మరింత అందుబాటు ధరలోకి తీసుకొచ్చింది. నెల వ్యవధిలోనే రెండుసార్లు ధరను తగ్గించింది. గత ఏడాది ఫిబ్రవరిలో ఈ ఫోన్‌ 8జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ రూ.56,999 వద్ద విడుదలైంది. ఇటీవల దీని ధరను కంపెనీ రూ.2,000 తగ్గించింది. తాజాగా మరో రూ.3,000 కుదించింది. మొత్తంగా రూ.5,000 తగ్గి రూ.51,999కే లభిస్తోంది.

కస్టమర్లను ఆకర్షించడం కోసం వన్‌ప్లస్‌ ఈ మోడల్‌పై (OnePlus 11 5G) మరిన్ని ఆఫర్లనూ అందిస్తోంది. ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.3,000 తక్షణ రాయితీ లభిస్తుంది. దీంతో ఫోన్‌ రూ.48,999కే వస్తుంది. ఎక్స్ఛేంజ్‌ బోనస్‌ కింద మరో రూ.5,000 వరకు తగ్గే అవకాశం ఉందని కంపెనీ వెబ్‌సైట్‌లో పేర్కొంది.

ఈ ఫోన్‌లో 120Hz రిఫ్రెష్‌ రేటుతో కూడిన 6.7 అంగుళాల క్వాడ్‌ హెచ్‌డీ+ ఈ4 డిస్‌ప్లే ఇస్తున్నారు. ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఆక్సిజన్‌ ఓఎస్‌ 13తో ఫోన్‌ పనిచేస్తుంది. స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 2 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. వెనుకవైపు 50 ఎంపీ మెయిన్‌ సెన్సర్‌ + ఓఐఎస్‌, 48 ఎంపీ అల్ట్రావైడ్‌ లెన్స్‌, 32 టెలిఫొటోతో కూడిన ట్రిపుల్‌ కెమెరా సెటప్‌ను ఇచ్చారు. సెల్ఫీల కోసం 16 ఎంపీ కెమెరా అమర్చారు. ఈ ఫోన్‌లో 100 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. కేవలం 25 నిమిషాల్లో వంద శాతం బ్యాటరీ ఛార్జ్‌ అవుతుందని కంపెనీ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని