Fixed Deposit Rates: ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను సవరించిన యూనియన్‌ బ్యాంక్‌.. లేటెస్ట్‌ రేట్లు ఇవే..

Fixed Deposit Rates: ప్రభుత్వ రంగానికి చెందిన యూనియన్‌ బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది. తాజాగా పెంచిన వడ్డీ రేట్లు ఇవీ..

Updated : 01 Jun 2024 15:20 IST

ixed Deposit Rates | ఇంటర్నెట్‌డెస్క్‌: యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (UBI) ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై (FD) అందించే వడ్డీ రేట్లను సవరించింది. రూ.2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్ చేసే ఎఫ్‌డీపై పెంచిన వడ్డీ రేట్లు వర్తిస్తాయని కంపెనీ తన అధికారిక వెబ్‌సైట్‌లో తెలిపింది. సవరించిన వడ్డీ రేట్లు ఈ రోజు (జూన్ 1) నుంచే అందుబాటులోకి వచ్చాయి. 

సాధారణ ప్రజలు చేసే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై పెంచిన వడ్డీ రేట్లను చూస్తే.. 7 రోజుల నుంచి 45 రోజుల మధ్య కాలపరిమితి కలిగిన ఎఫ్‌డీపై యూనియన్‌ బ్యాంక్‌ 3.5 శాతం వడ్డీ అందిస్తోంది. 45 రోజుల నుంచి 90 రోజుల కాలవ్యవధి ఎఫ్‌డీలపై 4.50 శాతం, 91 రోజుల నుంచి 180 రోజుల మధ్య 4.80 శాతం, 181 రోజుల నుంచి ఏడాది లోపల 6.25 శాతం వడ్డీ పొందొచ్చు. ఏడాది నుంచి 399 రోజుల కాలవ్యవధి ఎఫ్‌డీ రేట్లను 6.75 శాతం, 399 రోజులకు చేసే ఎఫ్‌డీపై 7.25 శాతం, 400 రోజుల నుంచి 998 రోజుల మధ్య 6.50 శాతం, 1000 రోజులు నుంచి 10 ఏళ్ల మధ్య అయితే 6.50 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. 

తగ్గిన వాణిజ్య సిలిండర్‌ ధర.. ₹లక్ష దిగువకు విమాన ఇంధనం

సీనియర్‌ సిటిజన్లకు (60-80 ఏళ్ల వారు) మాత్రం పైన తెలిపిన వడ్డీ రేట్ల కంటే అన్ని కాలపరిమితులపైనా 0.50 శాతం వడ్డీ అధికంగా పొందొచ్చు. అంటే 399 రోజులతో చేసే ఎఫ్‌డీపై గరిష్ఠంగా 7.75 శాతం వడ్డీ లభిస్తుంది. ఇక సూపర్‌ సీనియర్‌ సిటిజన్లకు (80 ఏళ్లు పైబడిన వారు) అందించే ఎఫ్‌డీ వడ్డీ రేట్లను 75 బేసిస్‌ పాయింట్లు పెంచారు. దీంతో 399 రోజల పరిమితితో చేసే ఎఫ్‌డీలపై 8 శాతం వడ్డీ పొందొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని