Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ల క్యూ.. నథింగ్‌, షావోమీ, రియల్‌మీ రెడీ!

Upcoming Smartphones: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలు 5జీ ఫోన్ల లాంచింగ్‌కు సిద్ధమయ్యాయి. ఫిబ్రవరి, మార్చి నెలాఖరులో వరుసగా ఫోన్లు విడుదల చేయనున్నాయి.

Updated : 21 Feb 2024 18:50 IST

Upcoming Smartphones | ఇంటర్నెట్‌ డెస్క్‌: అత్యాధునిక ఫీచర్లతో కూడిన 5జీ స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే, ఈ అప్‌డేట్ మీ కోసమే. కొత్త ఏడాదిలో అడపాదడపా ఫోన్లను రిలీజ్‌ చేసిన స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలు.. కొత్త ఫోన్ల విడుదలను వేగవంతం చేశాయి. మంచి కెమెరా, మెరుగైన పనితీరుతో స్టయిలిష్‌ డిజైన్‌తో కొత్త ఫోన్లను విడుదల చేసేందుకు సిద్ధమయ్యాయి. ఫిబ్రవరి నెలాఖరుతో పాటు మార్చి నెలలో కొన్ని ఫోన్లు విడుదల కానున్నాయి. ఇందులో రియల్‌మీ, నథింగ్‌, షావోమీ బ్రాండ్లు ఉన్నాయి. ఆ లిస్ట్‌పై లుక్కేయండి..

  • నథింగ్‌ ఫోన్‌ (2ఏ): నథింగ్‌ ఫోన్‌ 1, నథింగ్‌ ఫోన్‌ 2తో తనదైన మార్కెట్‌ను క్రియేట్‌ చేసుకున్న నథింగ్‌ కంపెనీ... బడ్జెట్‌ ధరలో 2ఏ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. మార్చి 5న ఇది విడుదల కానుంది. 6.7 అంగుళాల ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే, మీడియాటెక్‌ డైమెన్‌సిటీ 7200 ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్‌ 14తో ఈ ఫోన్‌ రానుంది. విడుదల సమయంలో మరిన్ని వివరాలు తెలియరానున్నాయి.
  • రియల్‌మీ 12+: రియల్‌మీ 12 ప్రో, రియల్‌మీ 12ప్రో+ పేరిట రెండు స్మార్ట్‌ఫోన్లను ఈ ఏడాది విడుదల చేసింది రియల్‌మీ. ఇప్పుడు 12+ పేరిట మిడ్‌రేంజ్‌ ఫోన్‌ను విడుదల చేయనుంది. మార్చి 6న ఈ కొత్త ఫోన్‌ విడుదల కానుంది.
  • షావోమీ 14: షావోమీ 14 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ మార్చి 7న దేశీయ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. 6.36 అంగుళాల ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్‌ 8 జనరేషన్‌ 3 ప్రాసెసర్‌తో ఈ ఫోన్‌ను చైనా మార్కెట్‌లో ప్రవేశపెట్టారు. దేశీయంగా దాదాపు ఇవే ఫీచర్లతో విడుదలయ్యే అవకాశం ఉంది.
  • శాంసంగ్‌ నుంచి ఏ55 మోడల్‌ సైతం త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. 6.5 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్‌ రేటుతో ఈ ఫోన్‌ రానుంది. ట్రిపుల్‌ కెమెరా ఇవ్వనున్నారని తెలుస్తోంది. మార్చి లేదా ఏప్రిల్‌లో ఈ ఫోన్‌ రానుంది.
  • వివో వి30 ప్రో: వివో వి30 సిరీస్‌లో ప్రో ఎడిషన్‌ను ఫిబ్రవరి 28న వివో లాంచ్‌ చేయనుంది. 3డీ కర్వ్‌డ్‌ డిస్‌ప్లే, ట్రిపుల్‌ కెమెరాతో ఈ స్మార్ట్‌ఫోన్‌ వస్తోంది.
  • ఒప్పో ఎఫ్‌25 ప్రో: ఒప్పో ఎఫ్‌25 స్మార్ట్‌ఫోన్‌ ఫిబ్రవరి 29న విడుదల కానుంది. ఇందులో 64 ప్రధాన కెమెరా, 32 ఎంపీ ఏఐ సెల్ఫీ కెమెరా తీసుకొస్తున్నారు. దీని ధర రూ.25వేలు ఉండొచ్చని అంచనా.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు