UPI: వెయ్యికోట్ల UPI లావాదేవీలు.. వరుసగా మూడోసారి

UPI transactions: యూపీఐ లావాదేవీలు వరుసగా మూడోసారి వెయ్యి కోట్ల మార్కును సొంతం చేసుకున్నాయి.

Updated : 01 Nov 2023 17:33 IST

ఇంటర్నెట్‌డెస్క్‌:  డిజిటల్‌ లావాదేవీల్లో కీలక పాత్ర పోషిస్తున్న యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (UPI) లావాదేవీలు వరుసగా మూడోసారి వెయ్యి కోట్ల మార్కును అధిగమించాయి. అక్టోబరులో యూపీఐ లావాదేవీల సంఖ్య 1,141 కోట్లకు చేరింది. దీంతో వాటి విలువ రూ.17.16 లక్షల కోట్లుగా నమోదైంది. ఈ విషయాన్ని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషేన్‌ ఆఫ్‌ ఇండియా (NPCI) తన అధికారిక ‘ఎక్స్‌’ ఖాతాలో వెల్లడించింది.

సెప్టెంబరులో యూపీఐ లావాదేవీల సంఖ్య 1,056 కోట్లు కాగా.. వాటి విలువ రూ.15.8 లక్షల కోట్లకు చేరింది. ఆగస్టులో 1,024 కోట్ల లావాదేవీలు జరగ్గా వాటి విలువ రూ.15.18 కోట్లకు పెరిగింది. జులైలో 996 కోట్ల లావాదేవీలు జరిగాయి. గతేడాదితో పోలిస్తే యూపీఐ ట్రాన్సాక్షన్స్‌లో గణనీయమైన వృద్ధి నమోదైందని ఎన్‌పీసీఐ పేర్కొంది. లావాదేవీల సంఖ్యలో 56శాతం, విలువ 42 శాతం పెరిగిందని తెలిపింది.

పని గంటలపై చర్చ.. కష్టపడేవాళ్లలో మనమూ ముందే

ఇమ్మిడియేట్ పేమెంట్ సర్వీస్ (IMPS) ద్వారా చేసే చెల్లింపులు.. సెప్టెంబరులో 47.73 కోట్లు కాగా, అక్టోబరు నాటికి ఆ సంఖ్య 49.3 కోట్లకు చేరింది. దీంతో ఆ లావాదేవీల మొత్తం విలువ రూ.5.38 లక్షల కోట్లకు చేరిందని పేర్కొంది. ఐఎంపీఎస్‌ లావాదేవీల సంఖ్యలో 2 శాతం, విలువ 15 శాతం పెరిగిందని ఎన్‌పీసీఐ పేర్కొంది. వ్యాపారులు, కస్టమర్లలో డిజిటల్‌ అడాప్షన్‌ బాగా పెరిగింది. దానికి తోడు రివార్డులు వంటి ప్రోత్సాహకాలను అందించటంతో చాలా మంది డిజిటల్‌ లావాదేవీలపైనే మొగ్గుచూపుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని