Smart Gadgets: ఈ స్మాల్‌ గ్యాడ్జెట్స్‌తో మీ ఇల్లు మరింత స్మార్ట్‌

usefull gadgets for home: ఇంట్లో ఉపయోగపడే స్మార్ట్‌ వస్తువుల కోసం వెతుకుతున్నారా? అయితే ఈ గ్యాడ్జెట్స్ పై ఓ లుక్కేయండి.

Updated : 05 Aug 2023 10:44 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బయటకెళ్లి వచ్చినప్పుడు ఏ చిప్స్ ప్యాకెటో.. స్నాక్సో కొంటాం. సగం తిని వదిలేస్తే అవి పాడైపోతాయి. అలా పాడవ్వకుండే ప్యాక్‌ చేసేందుకు ఏదైనా వస్తువు ఉంటే ఎంత బాగుణ్ణో అనిపిస్తుంది కదా! అలాగే కరెంటు పోయిన సందర్భంలో పక్క గదికి పోవాలన్నా భయం. అప్పుడు మనం డోర్ తీయగానే లైట్‌ వెలిగేలా ఏర్పాటు ఉంటే ఎంత బాగుంటుందో కదూ! ఒకవేళ ఉన్నా వాటి ధర ఏ వేలల్లోనో ఉంటుందని ఆలోచిస్తున్నారా? అస్సలు కానేకాదు. తక్కువ ధరలోనే మీ ఇంటిని స్మార్ట్‌గా మార్చుకొనే గ్యాడ్జెట్స్ కొన్ని ఉన్నాయి. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ లాంటి ఆన్‌లైన్‌ షాపింగ్ ఫ్లాట్‌ఫామ్‌ల నుంచి వీటిని కొనుగోలు చేయొచ్చు. అలాంటి గ్యాడ్జెట్స్‌పై లుక్కేద్దాం..


బ్యాగ్‌ సీలర్‌ (Bag sealer)

చిప్స్‌ దగ్గర నుంచి ఇంటి సరకుల వరకు చాలా వరకు మనకు దొరికేవి ప్యాకెట్లలోనే. ఒక సారి ప్యాకెట్‌ ఓపెన్ చేశాక మొత్తం వాడేయాలి. లేదా ఏ రబ్బర్‌ బ్యాండో చుట్టాలి. ఒక్కోసారి అలా భద్రపరిచినా ఏమాత్రం ఖాళీ ఉన్నా పదార్థాలన్నీ పాడవుతాయి. అలా కాకుండా ఉండేందుకు ఈ బ్యాగ్‌ సీలర్ ఉపయోగపడుతుంది. ఏ ప్లాస్టిక్‌ బ్యాగ్‌నైనా ఈ సీలర్‌ మధ్యలో ఉంచి గట్టిగా నొక్కితే చాలు సీల్‌ అయిపోతుంది. ఇక ఆ పదార్థాలు పాడవ్వవు. ఇదే సీలర్‌లో మరోవైపు ఉండే కటర్‌ సాయంతో ప్యాకెట్లను ఓపెన్ చేయొచ్చు కూడా. దీని ధర కేవలం రూ.400 మాత్రమే. కొన్ని దుకాణాల్లో పాలూ నెయ్యి వంటివి ప్యాక్‌ చేసే పెద్ద మెషిన్‌కు కాస్త పార్టబుల్‌ రూపమే ఈ సీలర్‌. ఒకవేళ దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవటానికి లింక్‌ పై క్లిక్ చేయండి..


సోలార్‌ లైట్ (solar outdoor lights)

కరెంటుతో పనిలేకుండా కేవలం సూర్య కిరణాలతో పనిచేసే ఈ లైట్ ఇది. కేవలం 6 నుంచి 8 గంటల వరకు ఎండలో ఉంచితే చాలు ఫుల్‌ ఛార్జ్‌ అవుతుంది. కేవలం రూ.400కే లభించే ఈ గ్యాడ్జెట్‌లో 2000 mAh బ్యాటరీ ఉంటుంది. నీరు, దుమ్ములోనికి చేరకుండా IP65 రేటింగ్‌ కలిగిన భద్రతతో వస్తోంది. ఔట్‌ డోర్‌ లైటింగ్‌ కోసం ఈ లైట్‌ను వినియోగించుకోవచ్చు. మరిన్ని వివరాలకు ఈ లింక్‌పై క్లిక్‌ చేయండి..


ఎలక్ట్రిక్‌ క్యాండిల్స్‌ (elcetric candles)

అచ్చం కొవ్వొత్తుల్లాగే కనిపించే ఈ విద్యుత్‌ క్యాండిల్స్‌ను రిమోట్‌ సాయంతో ఆపరేట్‌ చేయొచ్చు. లైట్‌ను ఆన్‌, ఆఫ్‌ చేయొచ్చు. టైమ్‌ సెట్‌ చేసుకోవచ్చు. క్యాండిల్స్ మోడ్‌, బ్రైట్‌లైట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. పండగలు, ప్రత్యేక సందర్భాల్లో అలంకరణార్థం వీటిని వినియోగించుకోవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలకు ఈ లింక్‌ పై క్లిక్ చేయండి..


స్మార్ట్‌ వైఫై ఎక్స్‌టెన్షన్‌ (smart wifi extention)

సాధారణ ఎక్స్‌టెన్షన్‌ బాక్స్‌లా కనిపించే గ్యాడ్జెట్‌ స్మార్ట్‌ వైఫై ఎక్స్‌టెన్షన్‌. ఇందులో మూడు పవర్‌ సాకెట్స్ ఉంటాయి. వీటి ద్వారా ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు వంటివి ఛార్జ్‌ చేసుకోవచ్చు. అలాగే మూడు యూఎస్‌బీ-ఏ పోర్ట్స్, ఒక యూఎస్‌బీ-సి ఛార్జింగ్ పోర్ట్‌ ఇందులో ఉంటాయి. అటు సాధారణ ఎక్స్‌టెన్షన్‌ బాక్స్‌లా వినియోగిస్తూనే.. మరోవైపు వైఫై ఎక్స్‌టెన్షన్‌లానూ వినియోగించుకోవచ్చు. దీన్ని స్మార్ట్‌ఫోన్‌ సాయంతో ఆపరేట్‌ చేయొచ్చు. ఛార్జింగ్‌కు టైమ్‌ సెట్‌ చేయొచ్చు. దీని ధర రూ.2వేల పైమాటే. పూర్తి వివరాల కోసం ఈ లింక్‌ పై క్లిక్ చేయండి.


వైర్‌లెస్‌ క్యాబినెట్ లైట్‌ (wireless cabinet light)

బ్రైట్‌లైట్‌తో వచ్చే ఈ లైట్‌లో టచ్‌ సెన్స్‌, మోషన్ సెన్సార్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. అందులో ఉన్న బటన్‌తో బ్రైట్‌నెస్‌ని పెంచుకోవచ్చు.. తగ్గించుకోవచ్చు. దీని వెనకున్న స్టిక్కర్‌ సాయంతో ఎక్కడైనా అతికించొచ్చు. చీకటిగా ఉండే వార్డ్‌బోర్డ్‌ లాంటి ప్రదేశాల్లో దీన్ని ఉంచొచ్చు. దీన్ని అమర్చిన చోటుకు వెళ్లగానే ఆటోమెటిక్‌గా లైట్ ఆన్‌ అవుతుంది. ఈ లైట్ 1100mAh బ్యాటరీ కలిగి ఉంటుంది. టైప్‌-c కేబుల్  సాయంతో దీన్ని ఛార్జ్‌ చేయచ్చు. పూర్తి వివరాల కోసం ఈ లింక్‌ పై క్లిక్ చేయండి.


గమనిక: మార్కెట్‌లో అందుబాటులో ఉన్న కొత్త ఉత్పత్తులను పరిచయం చేయడమే ఈ కథనం ఉద్దేశం. పై లింక్‌లు కూడా అవగాహన కోసం మాత్రమే. ఫలానా ఉత్పత్తినే కొనుగోలు చేయాలని ఈనాడు.నెట్‌ సూచించడం లేదు. అది వినియోగదారుల ఇష్టం. వస్తువుల ధరల్లోనూ మార్పులుండొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని