Anil Agarwal: మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్‌ టిప్స్‌

Anil Agarwal: తన దినచర్యను తెలపడంతో పాటు యువతకు ఆరోగ్య సూత్రాలను పంచుకున్నారు వేదాంత అధిపతి అనిల్‌ అగర్వాల్‌.

Updated : 24 Apr 2024 10:42 IST

Anil Agarwal | ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖులు, వ్యాపారవేత్తల దినచర్య గురించి ప్రతిఒక్కరికీ ఆసక్తి ఉంటుంది. వారు తమ రోజులను ఎలా ప్రారంభిస్తారు? ఎలాంటి ఆహారం తీసుకుంటారు? అనే విషయాలు తెలుసుకునేందుకు చాలా మంది ఎదురుచూస్తుంటారు. తాజాగా యువతకు ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు సిద్ధమయ్యారు వేదాంత అధిపతి అనిల్‌ అగర్వాల్‌ (Anil Agarwal). సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ‘‘ఎక్స్‌’’ వేదికగా యూత్‌కు కొన్ని టిప్స్‌ అందించారు. తాను పాటిస్తున్న నియమాలు, ఫిట్‌నెట్‌ సూత్రాల గురించి రాసుకొచ్చారు. 

‘‘నేటి యువత ఫిట్‌నెస్‌, ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతోంది. నేను ఎప్పుడూ నా పిల్లలు, యువతకు ఓ విషయం చెబుతాను. మీరు బాహ్య రూపానికి ఎంత ప్రాధాన్యం ఇస్తారో.. మీ మనసుకు ప్రశాంతతనిచ్చే వ్యాయాయం చేయడానికీ అంతే ప్రాధాన్యం ఇవ్వాలి. మీ ప్రవర్తన, వైఖరి మెరుగవడంలో ఇవి ముఖ్య పాత్ర పోషిస్తాయి’’ అని అగర్వాల్‌ రాసుకొచ్చారు. మనసు, శరీరం రెండింటికీ సమ ప్రాధాన్యం ఇచ్చేలా తన దినచర్యను రూపొందించుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

గుంపులో స్మార్ట్‌ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్‌తో పట్టేశాడు..!

‘‘నా దినచర్యలో భాగంగా రోజూ గంట సేపు ఈత కొడతా, 30 నిమిషాలు లైట్ వెయిట్‌ ట్రైనింగ్‌, 30 నిమిషాలు ధ్యానం కోసం కేటాయిస్తా. రోజులో ఈ రెండు గంటలు నాకు చాలా ముఖ్యమైనవి. దీనితో నేను 10 రెట్లు మెరుగ్గా పని చేయగలనని భావిస్తా’’ అంటూ తన వ్యాయామం గురించి అగర్వాల్‌ తెలిపారు. తన భార్య రోజూ అందించే సీక్రెట్‌ గ్రీన్‌ జ్యూస్‌ రెసిపీని పంచుకున్నారు. కొన్నేళ్లనుంచీ దాన్ని డైట్‌లో భాగంగా తీసుకుంటున్నట్లు.. ఆరోగ్యంగా ఉంచేందుకు ఆ జ్యూస్‌ తనకు సాయపడిందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని