Vodafone Idea: ₹169 రీఛార్జితో 90 రోజుల డిస్నీ సబ్‌స్క్రిప్షన్‌.. వొడా కొత్త ప్లాన్‌

Vodafone Idea: డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌తో వొడాఫోన్‌ ఐడియా కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 

Published : 19 Mar 2024 17:14 IST

Vodafone Idea | ఇంటర్నెట్‌డెస్క్‌: కస్టమర్లను ఆకట్టుకోవడంలో భాగంగా ప్రముఖ టెలికాం కంపెనీ వొడాఫోన్‌ ఐడియా (Vodafone Idea) కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను (prepaid plan) తీసుకొచ్చింది. ఓటీటీలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఈతరహా సేవల్ని అందించడానికి రూ.169 ప్లాన్‌ తీసుకొచ్చింది. వొడా అందుబాటులోకి తెచ్చిన కొత్త ప్లాన్‌ వివరాలు ఓసారి చూసేయండి.

వొడాఫోన్‌ ఐడియా కొత్తగా తీసుకొచ్చిన రూ.169 ప్లాన్‌ 30 రోజుల వ్యాలిడిటీతో వస్తోంది. మూడు నెలల పాటు డిస్నీ+ హాట్‌స్టార్‌ మొబైల్‌ వెర్షన్‌ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. ఈ రీఛార్జితో మొత్తం 8జీబీ డేటా ఇస్తున్నారు. రోజువారీ వినియోగంపై ఎలాంటి పరిమితీ లేదు. ప్లాన్‌లో వాయిస్‌ కాలింగ్‌, ఎస్సెమ్మెస్‌లు వంటి ఇతర ఎలాంటి ప్రయోజనాలు ఉండవు. అదనపు డేటాతో పాటు ఓటీటీ బెన్‌ఫిట్స్‌ కావాలనుకునే వారు ఈ ప్లాన్‌ను పరిశీలించొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు