Vivo T3: వివో కొత్త ఫోన్‌.. T3 5జీ స్పెసిఫికేషన్స్‌ ఇవే!

Vivo T3: వివో టీ3 పేరిట కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. దీని ధర రూ.19,999 నుంచి ప్రారంభం అవుతుంది. మార్చి 27 నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.

Updated : 30 Mar 2024 14:49 IST

Vivo T3 | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీ వివో (Vivo) మరో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను దేశీయ మార్కెట్లోకి లాంచ్‌ చేసింది. T సిరీస్‌లో గతేడాది విడుదల చేసిన టీ2కు కొనసాగింపుగా.. టీ3 5జీని తాజాగా తీసుకొచ్చింది. అమోలెడ్‌ డిస్‌ప్లే, 4కె వీడియో రికార్డింగ్‌, 44W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ వంటి ఫీచర్లతో ఈ ఫోన్‌ వస్తోంది. ఇప్పటికే విడుదలైన ఐకూ జెడ్‌ 9లో ఉన్న ఫీచర్లే దాదాపుగా ఇందులోనూ ఉన్నాయి.

వివో టీ3 5జీ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8జీబీ+128జీబీ మోడల్‌ ధర రూ.19,999గా కంపెనీ నిర్ణయింంచింది. 8జీబీ+256జీబీ వేరియంట్‌ ధరను రూ.21,999గా పేర్కొంది. మార్చి 27 నుంచి వివో ఇండియా ఇ-స్టోర్‌, ఫ్లిప్‌కార్ట్‌లో సేల్‌కు రానుంది. లాంచ్‌ ఆఫర్‌ కింద హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎస్‌బీ కార్డ్స్‌తో కొనుగోలు చేస్తే రూ.2 వేలు డిస్కౌంట్‌ పొందొచ్చు. ఎక్స్ఛేంజీపై కూడా డిస్కౌంట్ ఇస్తున్నారు. మార్చి 31లోగా కొనుగోలుపై vivo XE710 ఇయర్‌ ఫోన్స్‌ను ఉచితంగా అందిస్తున్నారు. కాస్మిక్‌ బ్లూ, క్రిస్టల్‌ ఫ్లేక్‌ రంగుల్లో లభిస్తుంది.

iQOO Z9: 3 ఏళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌తో ఐకూ జెడ్‌9

ఇక ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6.67 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ అమోలెడ్‌ డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్‌ రేటు, 1800 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌తో వస్తోంది. మీడియా టెక్‌ డైమెన్‌సిటీ 7200 ప్రాసెసర్‌ అమర్చారు. హైబ్రిడ్‌ స్లాట్‌ ఇచ్చారు. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత ఫన్‌టచ్‌ ఓఎస్‌ 14తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది. వెనుక వైపు 50 ఎంపీ సోనీ ఐంఎఎక్స్‌ 882 సెన్సర్‌ అమర్చారు. ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌తో వస్తోంది. 2 ఎంపీ డెప్త్‌ సెన్సర్‌ ఉంది. ముందువైపు 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. ఇన్‌-డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్ సెన్సర్‌ ఉంది. ఇందులోని 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ 44W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని