Vivo T3X: 6,000mAh బ్యాటరీతో వివోలో బడ్జెట్‌ 5G ఫోన్‌.. ధర, ఫీచర్లివే..

Vivo T3X: వివో టీ2ఎక్స్‌కు కొనసాగింపుగా వివో టీ3ఎక్స్‌ విడుదలైంది. కెమెరా, డిస్‌ప్లే సహా ఇతర ఫీచర్లను అప్‌గ్రేడ్‌ చేస్తూ దీన్ని తీసుకొచ్చారు.

Published : 17 Apr 2024 15:07 IST

Vivo T3X | ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ-సిరీస్‌లో వివో మరో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. వివో టీ3ఎక్స్‌ (Vivo T3X) పేరిట కంపెనీ దీన్ని విడుదల చేసింది. టీ2ఎక్స్‌ను బ్యాటరీ, డిస్‌ప్లే, కెమెరా విషయంలో అప్‌గ్రేడ్‌ చేస్తూ కొత్త ఫోన్‌ను రూపొందించింది. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం.

వివో టీ3ఎక్స్‌లో (Vivo T3X) 6.72 అంగుళాల ఫ్లాట్‌ ఫుల్‌ హెచ్‌డీ+ ఎల్‌సీడీ స్క్రీన్‌ను పొందుపర్చారు. దీని రిఫ్రెష్‌ రేటు 120Hz. 8ఎంపీ సెల్ఫీ కెమెరాతో కూడిన సెంటర్డ్‌ పంచ్‌ హోల్‌ ఉంది. వెనకభాగంలో 50 ఎంపీ ప్రైమరీ, 2ఎంపీ డెప్త్‌తో కూడిన కెమెరా సెటప్‌ ఇచ్చారు. స్నాప్‌డ్రాగన్‌ 6 జెన్‌ 1 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 128జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ను మైక్రోఎస్‌డీ కార్డుతో 1టీబీ వరకు విస్తరించుకోవచ్చు. 44వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీ ఇచ్చారు. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత ఫన్‌టచ్‌ఓఎస్‌ 14 ఔటాఫ్‌ బాక్స్‌ ఓఎస్‌తో ఈ ఫోన్‌ వస్తోంది. బ్లూటూత్‌ 5.1, డ్యూయల్‌ బ్యాండ్‌ వైఫై, సైడ్ మౌంటెడ్‌ ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌ వంటి ఫీచర్లూ ఉన్నాయి.

వివో టీ3ఎక్స్‌లో (Vivo T3X) మూడు వేరియంట్లు ఉన్నాయి. 4జీబీ ర్యామ్‌ + 128జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.13,999. 6జీబీ ర్యామ్‌ + 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ.14,999. 8జీబీ ర్యామ్‌ + 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ.16,499. విడుదల సందర్భంగా ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేసేవారికి రూ.1,500 వరకు రాయితీ లభిస్తోంది. ఏప్రిల్‌ 24 నుంచి వివో ఈ-స్టోర్‌, ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయానికి అందుబాటులో ఉంటాయి. ఈరోజు నుంచి ప్రీ-బుకింగ్‌ ప్రారంభమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని