Vivo X Fold 3 Pro: వివో కొత్త ఫోల్డబుల్‌ ఫోన్‌.. ధర రూ.లక్షన్నర పైనే!

Vivo X Fold 3 Pro: స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 3 ప్రాసెసర్‌, ట్రిపుల్‌ కెమెరా సెటప్‌, 8.03 అంగుళాల ప్రధాన తెర వంటి స్పెసిఫికేషన్లతో వివో ఎక్స్‌ ఫోల్డ్‌ 3 ప్రో ఫోల్డబుల్‌ ఫోన్‌ భారత్‌లో విడుదలైంది. 

Published : 06 Jun 2024 15:13 IST

Vivo X Fold 3 Pro | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వివో మరో కొత్త ఫోల్డబుల్‌ ఫోన్‌ను భారత్‌లో గురువారం విడుదల చేసింది. వివో ఎక్స్‌ ఫోల్డ్‌ 3 ప్రో (Vivo X Fold 3 Pro) పేరిట తీసుకొచ్చింది. స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 3 ప్రాసెసర్‌, ట్రిపుల్‌ కెమెరా సెటప్‌, 8.03 అంగుళాల అమోలెడ్‌ తెర వంటి ఫీచర్లు ఉన్నాయి.

వివో ఎక్స్‌ ఫోల్డ్‌ 3 ప్రో ఫీచర్లు..

డ్యూయల్‌ నానో సిమ్‌తో వస్తోన్న వివో ఎక్స్‌ ఫోల్డ్‌ 3 ప్రో (Vivo X Fold 3 Pro) ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత ఫన్‌టచ్‌ ఓఎస్ 14తో పనిచేస్తుంది. 8.3 అంగుళాల పరిమాణం ఉన్న లోపలి డిస్‌ప్లే 2కే+ రెజల్యూషన్‌, డాల్బీ విజన్‌, హెచ్‌డీఆర్‌10 సపోర్ట్‌తో వస్తోంది. కవర్‌ డిస్‌ప్లే పరిమాణం 6.53 అంగుళాలు. రెండూ 120Hz రీఫ్రెష్‌ రేటు, 4,500 గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో వస్తున్నాయి. ఫోన్‌ పరిమాణంలో ప్రధాన స్క్రీన్‌ 91.77 శాతం, లోపలి తెర 90.92 శాతం నిష్పత్తిలో ఉన్నాయి.

వివో ఎక్స్‌ ఫోల్డ్‌ 3 ప్రో (Vivo X Fold 3 Pro) ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీంట్లో హింజ్‌ను కార్బన్‌ ఫైబర్‌తో తయారుచేశారు. అది రోజుకు 100 సార్లు చొప్పున మడతబెట్టినా 12 ఏళ్ల పాటు సమర్థంగా పనిచేయగలదని కంపెనీ తెలిపింది. ఫోన్‌ ముందుభాగాన్ని గ్లాస్‌తో, వెనక గ్లాస్‌ ఫైబర్‌తో తయారుచేశారు. మధ్య భాగాన్ని అల్యూమినియం లోహపు పదార్థంతో రూపొందించారు. f/1.68 లెన్స్‌, ఓఐఎస్‌, 64MP టెలిఫొటో సెన్సర్‌, 50MP అల్ట్రావైడ్‌ సెన్సర్‌తో కూడిన 50MP ప్రధాన కెమెరా సెటప్‌ను ఇచ్చారు. సెల్ఫీల  కోసం కవర్‌ స్క్రీన్‌పై f/2.4 అపెర్చర్‌తో కూడిన 32MP కెమెరాను పొందుపర్చారు. ఈ ఫోన్‌లో వివో వీ3 ఇమేజింగ్‌ చిప్‌ కూడా ఉంది.

5జీ, వైఫై 7, బ్లూటూత్‌ 5.4, ఎన్‌ఎఫ్‌సీ, జీపీఎస్‌, బైడూ, గ్లోనాస్‌, గెలీలియో, నావిక్‌, క్యూజెడ్‌ఎస్‌ఎస్‌, ఏ-జీపీఎస్‌, యూఎస్‌బీ టైప్‌-సి పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. యాక్సెలరోమీటర్‌, యాంబియెంట్ లైట్‌, ఫ్లికర్‌, ప్రాగ్జిమిటీ, గైరో, కలర్‌ టెంపరేచర్‌, ఎలక్ట్రానిక్‌ కంపాస్‌ వంటి సెన్సర్లు ఉన్నాయి. అథెంటికేషన్‌ కోసం ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌ను కూడా ఇచ్చారు. 100W వైర్డ్‌, 50W వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 5,700mAh బ్యాటరీని ఇచ్చారు.

వివో ఎక్స్‌ ఫోల్డ్‌ 3 ప్రో ధర..

వివో ఎక్స్‌ ఫోల్డ్‌ 3 ప్రో (Vivo X Fold 3 Pro) ఫోన్‌ భారత్‌లో కేవలం 16GB ర్యామ్‌ + 512GB స్టోరేజ్‌తో మాత్రమే వస్తోంది. ఇది సెలెస్టియల్‌ బ్లాక్‌ రంగులో లభిస్తోంది. దీని ధర రూ.1,60,000. వివో ఇండియా, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లో ప్రీబుకింగ్‌కు అందుబాటులో ఉంది. జూన్‌ 13 నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. విడుదల సందర్భంగా ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ కార్డు ద్వారా కొనుగోలు చేసినవారికి రూ.15,000 వరకు రాయితీ ఇస్తోంది. రూ.10,000 ఎక్స్ఛేంజ్‌ బోనస్‌ కూడా ఉంది. 24 నెలల పాటు నెలకు రూ.6,666తో నో-కాస్ట్‌ ఈఎంఐ వెసులుబాటు కూడా ఉంది. వివో వైర్‌లెస్‌ 2.0 ఛార్జర్‌ జూన్‌ 17 నుంచి వివో ఇ-స్టోర్‌, ఆఫ్‌లైన్‌ ఛానళ్లలోనూ అందుబాటులోకి రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని