Vivo: 64ఎంపీ కెమెరాతో వివో కొత్త ఫోన్‌.. ఫీచర్లు ఇవే..

Vivo Y200 Pro: వివో తన ‘Y’ సిరీస్‌లో వై200 ప్రో 5జీ పేరుతో కొత్త మొబైల్‌ లాంచ్‌ చేసింది. ధర, ఫీచర్ల విషయాలపై ఓ లుక్కేద్దాం.

Published : 22 May 2024 00:08 IST

Vivo Y200 Pro | ఇంటర్నెట్‌డెస్క్‌:  చైనా మొబైల్‌ తయారీ కంపెనీ వివో (Vivo) తన ‘Y’ సిరీస్‌లో మరో కొత్త ఫోన్‌ను భారత్‌ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. వివో వై200 ప్రో 5జీ (Vivo Y200 Pro 5G) పేరుతో లాంచ్‌ చేసింది.    V-షీల్డ్ ప్రొటెక్షన్‌తో పాటు 6 నెలల అదనపు వారెంటీ ప్రయోజనాలతో దీన్ని తీసుకొచ్చినట్లు కంపెనీ తెలిపింది. 

వివో వై200ప్రో 5జీ మొబైల్‌ ఓ వేరియంట్‌లో లభిస్తుంది. 8జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.24,999గా నిర్ణయించింది. సిల్క్‌ బ్లాక్‌, సిల్క్‌ గ్రీన్‌ రంగుల్లో ఫోన్‌ లభిస్తుంది. ఎస్‌బీఐ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌ ద్వారా కొనుగోలు చేస్తే రూ.2,500 ఇన్‌స్టంట్‌ క్యాష్‌బ్యాక్‌ పొందొచ్చని కంపెనీ చెబుతోంది. రోజుకు రూ.45 ఈఎంఐ సదుపాయం ఉందని తెలిపింది. విక్రయాలు ప్రారంభమయ్యాయని ఫ్లిప్‌కార్డ్‌, వివో ఇండియా ఇ-స్టోర్‌ ద్వారా కొనుగోలు చేయొచ్చని కంపెనీ పేర్కొంది.

ఏఐపై ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇన్ఫోసిస్‌ సీటీఓ సూచనలు

ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే.. వివో కొత్త మొబైల్‌లో 6.78 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ అమోలెడ్‌ డిస్‌ప్లే ఇచ్చారు. ఇది 120Hz రిఫ్రెష్‌ రేటు, 1300 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ కలిగిఉంటుంది. క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 695 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 14 (Android 14) ఆధారిత ఫన్‌టచ్‌ఓఎస్‌ 14తో వస్తోంది. వెనకవైపు 64ఎంపీ ప్రధాన కెమెరా, 2ఎంపీ డెప్త్‌ సెన్సర్‌ ఇచ్చారు. వీడియో కాల్స్, సెల్ఫీల కోసం ముందువైపు 16 ఎంపీ కెమెరా అమర్చారు. 5,500mAh బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్‌ 44W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. మైక్రో ఎస్‌డీ కార్డ్‌ స్లాట్ సదుపాయం ఉంది. 5జీ, వైఫై, బ్లూటూత్‌ 5.1, జీపీఎస్‌, ఓటీజీ, యూఎస్‌బీ టైప్‌-సీ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు