Vodafone Idea: రూ.202తో 13 ఓటీటీలు.. వొడాఫోన్‌ ఐడియా కొత్త ప్లాన్‌

Vodafone Idea: ఓటీటీ యూజర్ల కోసం వొడాఫోన్‌ ఐడియా ప్రత్యేకంగా రూ.202 ప్లాన్‌ను తీసుకొచ్చింది.

Published : 20 Dec 2023 13:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వొడాఫోన్‌ ఐడియా కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌ (Vodafone Idea Prepaid Plan)ను తీసుకొచ్చింది. తమ కస్టమర్లకు ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించడమే లక్ష్యంగా రూ.202 ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ‘వీఐ మూవీస్‌ అండ్ టీవీ’ పేరిట ఈ టెలికాం కంపెనీ ఇప్పటికే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను అందిస్తోంది. తాజాగా తీసుకొచ్చిన కొత్త ప్లాన్‌తో ‘వీఐ మూవీస్‌ అండ్‌ టీవీ ప్రో’ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది.

కొత్తగా తీసుకొచ్చిన రూ.202 ప్లాన్‌లో వొడాఫోన్‌ ఐడియా 13కు పైగా ఓటీటీలతో కూడిన ‘వీఐ మూవీస్‌ అండ్‌ టీవీ ప్రో’ సబ్‌స్క్రిప్షన్‌ లభిస్తుంది. ఈ ప్లాన్‌తో లభించే ఓటీటీ సర్వీస్‌లు ఏంటనేది మాత్రం సంస్థ ప్రత్యేకంగా పేర్కొనలేదు. కానీ, ‘వీఐ మూవీస్‌ అండ్‌ టీవీ ప్రో’లో సోనీలివ్‌, జీ5, డిస్నీ+ హాట్‌స్టార్‌, సన్‌నెక్ట్స్‌, హంగామా, షెమారూమీ వంటి ప్రముఖ ఓటీటీలు ఉంటాయి. ఈ  ప్లాన్‌లో వీటన్నింటినీ ఒక నెల పాటు ఎంజాయ్‌ చేయొచ్చు. అయితే, ఈ ప్లాన్‌లో వాయిస్‌ కాలింగ్‌, డేటా వంటి ఇతర ఎలాంటి ప్రయోజనాలు లేకపోవడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని