Narayana Murthy: 40 ఏళ్లు అలాగే పనిచేశా.. ‘70 పనిగంటల’ను సమర్థించుకున్న నారాయణమూర్తి

Narayana Murthy: వారానికి 70 గంటలు పనిచేయాలంటూ చేసిన వ్యాఖ్యలను ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తి సమర్థించుకున్నారు. తాను 40 ఏళ్ల పాటు అలాగే పనిచేశానని తెలిపారు. 

Published : 09 Dec 2023 12:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్‌ చేరాలంటే దేశ యువత వారానికి 70 గంటల చొప్పున పనిచేయాలంటూ ఇటీవల ఇన్ఫోసిస్‌ (Infosys) సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి (Narayana Murthy) వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరిగింది. పారిశ్రామికవేత్తలు, టెక్‌ సీఈవోలు కూడా దీనిపై స్పందిస్తూ భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తపర్చారు. తాజాగా నారాయణమూర్తి మరోసారి పనివేళలపై మాట్లాడుతూ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు.

‘‘పేదరికం నుంచి తప్పించుకోవడానికి మనకున్న ఏకైక మార్గం కష్టపడి పనిచేయడమే అని నా తల్లిదండ్రులు నాకు చిన్నప్పుడే నేర్పించారు. నా 40 ఏళ్ల వృత్తి జీవితంలో నేను అదే పాటించా. ఉదయం 6.20 గంటలకే ఆఫీసుకు వెళ్లి.. మళ్లీ రాత్రి 8.30 గంటలకు ఇంటికి వచ్చేవాడిని. వారానికి 70 గంటలు పైనే పనిచేశా. 1994 వరకు మాకు వారానికి ఆరు పనిదినాలు ఉండేవి. అప్పుడైతే వారానికి కనీసం 85-90 గంటలు పనిచేసేవాడిని. ఆ కష్టం వృథా కాలేదు’’ అని ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నారాయణ మూర్తి (Narayana Murthy) వెల్లడించారు.

యూట్యూబ్‌లో ఇక కామెంట్లను పాజ్‌ చేయొచ్చు!

కొద్దిరోజుల క్రితం ఇన్ఫోసిస్‌ మాజీ సీఎఫ్‌ఓ మోహన్‌దాస్‌ పాయ్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘ది రికార్డ్‌’ అనే పాడ్‌కాస్ట్‌ తొలి ఎపిసోడ్‌లో మాట్లాడిన నారాయణ మూర్తి.. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో ఉత్పాదకత తక్కువని అన్నారు. అందుకే దేశ యువత మరిన్ని గంటలు అధికంగా శ్రమించాలన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్‌, జర్మనీ వంటి దేశాలు ఎలాగైతే కష్టపడ్డాయో.. మనమూ అలా శ్రమించాలని అన్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడాలంటే భారత్‌లోని యువత వారానికి 70 గంటల పాటు పనిచేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి. కొందరు ఉద్యోగ జీవితంలో ఉండే ఇబ్బందులను లేవనెత్తగా.. మరికొందరు బాస్‌లు మాత్రం నారాయణ మూర్తి అభిప్రాయాన్ని స్వాగతించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు