YouTube: యూట్యూబ్‌లో ఇక కామెంట్లను పాజ్‌ చేయొచ్చు!

YouTube: కంటెంట్‌ క్రియేటర్లకు వారి కామెంట్‌ సెక్షన్‌పై మరింత నియంత్రణ కల్పించేందుకు యూట్యూబ్‌ కొత్త ఫీచర్‌ని అందుబాటులోకి తెచ్చింది.

Published : 09 Dec 2023 01:52 IST

YouTube Pause feature | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ వీడియో స్ట్రీమింగ్‌ వేదిక యూట్యూబ్‌ (YouTube) కంటెంట్‌ క్రియేటర్ల కోసం కొత్త ఫీచర్‌ని తీసుకొచ్చింది. ‘pause’ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫీచర్‌ సాయంతో పాత కామెంట్లను అలాగే ఉంచి కొత్త కామెంట్లను నిలువరించొచ్చు. కంటెంట్‌ క్రియేటర్లకు వారి కామెంట్‌ సెక్షన్‌లో మరింత నియంత్రణ కల్పించటమే లక్ష్యంగా దీన్ని తీసుకొచ్చింది.

వాట్సప్‌లో ఇకపై వాయిస్‌ మెసేజ్‌లకు ‘వ్యూ వన్స్‌’.. త్వరలో ఈ ఫీచర్‌ కూడా..

ఇప్పటివరకు యూట్యూబ్‌లో వీడియోల కింద చేసే కామెంట్లు కావాలంటే పబ్లిష్‌ చేయవచ్చు. లేదా పూర్తిగా డిజేబుల్‌ చేయొచ్చు. ఒకవేళ కామెంట్ల మధ్యలో ఆపాలంటే పూర్తిగా తీసేయడం ఒక్కటే మార్గం. యూట్యూబ్‌ తీసుకొచ్చిన కొత్త ఫీచర్‌ ద్వారా పాత కామెంట్లను అలానే ఉంచుతూ కొత్త కామెంట్లు చేయకుండా నియంత్రించవచ్చు. ఈ ఫీచర్‌ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు యూట్యూబ్‌ తన బ్లాగ్‌లో తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని