#look between trend: సోషల్‌మీడియాలో ‘లుక్‌ బిట్‌వీన్ కీబోర్డ్‌’ ట్రెండ్‌.. ఇంతకీ ఏమిటిది..?

సోషల్‌మీడియాలో లుక్‌ బిట్‌వీన్‌ పేరిట కొత్త ట్రెండ్‌ మొదలైంది. ఇంతకీ ఏమిటీ ట్రెండ్‌..? ఎక్కడ మొదలైంది?

Published : 24 Apr 2024 00:11 IST

Look between trend | ఇంటర్నెట్‌ డెస్క్: సోషల్‌మీడియాలో ఎప్పుడు ఏది ట్రెండ్ అవుతుందో చెప్పలేం. సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉన్నవారైతే.. ఆ ట్రెండ్‌ను అందిపుచ్చుకుని వెంటనే పోస్టులు కూడా పెట్టేస్తుంటారు. కొందరైతే ఈ పోస్టులకు అర్థమేంటో తెలుసుకోవడంలో ఇబ్బందిపడుతుంటారు. ప్రస్తుతం అలా ట్రెండ్‌ అవుతున్నదే ‘లుక్‌ బిట్‌వీన్‌ యువర్ కీ బోర్డు’ ట్రెండ్‌. ఇంతకీ ఏమిటీ ట్రెండ్‌? ఎక్కడ మొదలైంది?

‘లుక్‌ బిట్‌వీన్‌ H అండ్‌ L ఆన్‌ యువర్‌ కీ బోర్డు’ అంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు. సాధారణంగా మనం వాడే కీబోర్డుల్లో వాటి మధ్య లెటర్స్‌ ‘JK’ అని ఉంటాయి. అంటే దానర్థం జస్ట్‌ కిడ్డింగ్‌ అన్నమాట. ఇంటర్వ్యూయర్‌ చూపు ఎప్పుడూ X అండ్‌ B మధ్య (CV) ఉంటుందని ఓ వ్యక్తి పోస్ట్‌ చేశాడు. అభ్యర్థి CVపైనే దృష్టి ఉంటుందన్న అర్థంలో దాన్ని పోస్ట్‌ చేశాడు. ఇవే కాదు.. ఇలా కీబోర్డులోని వివిధ అక్షరాలతో తమదైన శైలిలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. నెటిజన్లే కాదు.. గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌, సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌, స్విగ్గీ ఈ ట్రెండ్‌ను అందిపుచ్చుకుని పోస్టులు పెట్టాయి.

ఇంతకీ ఎక్కడ మొదలైంది?

ఈ ట్రెండ్‌ ఇప్పటిది కాదు. 2021లో 4Chan అనే వెబ్‌సైట్‌లో ఈ ట్రెండ్‌ మొదలైంది. K-ON అనే యానిమేటెడ్‌ సిరీస్‌లో పాత్రను పరిచయం చేయడానికి ఈ ట్రెండ్‌ను ఉపయోగించారు. అప్పట్లో ‘లుక్ బిట్‌వీన్‌ T అండ్‌ O అంటూ ‘YUI’ అనే పాత్రను పరిచయం చేశారు. దాదాపు మూడేళ్ల తర్వాత ఇప్పుడు ఈ ట్రెండ్‌ మొదలైంది. దీనిపై కొందరు నెటిజన్లు అసహనం వ్యక్తంచేస్తున్నారు. వేలంవెర్రి కాకపోతే మరేంటి? అంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని