PMMY: ముద్ర యోజనలో మహిళలకే ప్రాధాన్యం: నిర్మలా సీతారామన్‌

Pradhan Mantri MUDRA Yojana: ప్రధాన మంత్రి ముద్ర యోజన పథకంలో మహిళలకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు.

Published : 19 Nov 2023 18:50 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సూక్ష్మ, చిన్నతరహా సంస్థలకు రుణాలను అందించడమే లక్ష్యంగా కేంద్రం తీసుకొచ్చిన ప్రధాన మంత్రి ముద్ర యోజన (Pradhan Mantri MUDRA Yojana) పథకంలో మహిళలకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) తెలిపారు. రామేశ్వరంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మధ్యవర్తులు లేకుండా లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.

రామేశ్వరంలో ప్రధానమంత్రి ‘స్వానిధి సే సమృద్ధి స్కీమ్‌’ కింద వీధి వ్యాపారులకు రుణం మంజూరు పత్రాలను పంపణీ చేశారు. రామేశ్వరంలో ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు 2,200 మందిని..  జిల్లాలో 5 వేల మందికి పైగా వీధి వ్యాపారులను గుర్తించామని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వీధి వ్యాపారులను మున్సిపాలిటీ అధికారులు  గుర్తించి ఈ పథక ప్రయోజనాలు పొందటంలో వారికి సాయపడాలన్నారు. జన్ ధన్, ఆధార్, మొబైల్ త్రయంతో నేరుగా లబ్ధిదారుల ఖాతాకే డబ్బులు బదిలీ చేయటం ద్వారా మధ్యవర్తులను తప్పించామని వెల్లడించారు.

ఆనంద్‌ మహీంద్రా మ్యాచ్‌ చూడడం లేదట.. ఎందుకో తెలుసా?

ప్రధాన మంత్రి ముద్ర యోజన పథకం గురించి మాట్లాడుతూ.. మహిళా పారిశ్రామికవేత్తలకు బ్యాంకుల సాయంతో సులువుగా రుణాలు అందించడానికి దీన్ని ప్రవేశపెట్టినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా 100 మంది లబ్ధి పొందితే వారిలో 60 మంది మహిళలే ఉన్నారని తెలిపారు. ప్రధానమంత్రి ముద్రా పథకం కింద మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. సూక్ష్మ, చిన్నతరహా వ్యాపారం చేయాలనుకొనేవారికి ఆర్థిక చేయూతను అందించేందుకు రూ.10 లక్షల వరకు రుణాలు అందించేందుకు 2015 ఏప్రిల్ 8న ప్రధాని ఈ పథకాన్ని ప్రారంభించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని