Bajaj Auto: ప్రపంచంలోనే తొలి CNG బైక్‌.. వచ్చేది అప్పుడే!

Bajaj Auto: మబజాజ్‌ నుంచి మొదటి సీఎన్‌జీ ద్విచక్ర వాహనం వచ్చే త్రైమాసికం నాటికి రానుంది. ఈవిషయాన్ని సంస్థ ఎండీ స్వయంగా వెల్లడించారు.

Published : 06 Mar 2024 15:32 IST

Bajaj Auto | ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ ఆటోమొబైల్‌ దిగ్గజం బజాజ్‌ ఆటో(Bajaj Auto).. ప్రపంచంలోనే తొలిసారిగా సీఎన్‌జీతో (CNG) నడిచే ద్విచక్ర వాహనాన్ని తీసుకురానుంది. ఇప్పటికే త్రీ వీలర్‌ విభాగంలో సత్తా చాటుతున్న ఆ కంపెనీ.. తాజాగా తన ద్విచక్ర వాహన వ్యాపారంలో సంచలనం నమోదు చేసే దిశగా అడుగులు వేస్తోంది. అందులోభాగంగా వచ్చే త్రైమాసికం నాటికి మొదటి సీఎన్‌జీ బైక్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల ఓ ఆంగ్ల ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బజాజ్‌ ఆటో మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజీవ్‌బజాజ్‌ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. 

‘సీస్పేస్‌’.. తొలి ప్రభుత్వ రంగ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌

బజాజ్‌ నుంచి సీఎన్‌జీ బైక్‌ తీసుకొస్తారని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. 2025లో ఈ బైక్‌ తీసుకొస్తారని తొలుత ప్రచారం జరిగింది. అంతకంటే ముందే ఈ బైక్‌ను తీసుకొచ్చేందుకు బజాజ్‌ సన్నాహాలు చేస్తోంది. పర్యావరణపరంగా సంప్రదాయ పెట్రోల్‌ వాహనంతో పోలిస్తే సీఎన్‌జీ కారణంగా 50శాతం మేర ఉద్గారస్థాయిలు తగ్గుతాయని రాజీవ్‌ పేర్కొన్నారు. దేశానికి, సమాజానికి, వినియోగదారుడికి కూడా సీఎన్‌జీ సరైన ఎంపిక అని బజాజ్‌ ఆటో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాకేశ్‌శర్మ అన్నారు. ఈ సెగ్మెంట్‌లో మరిన్ని వాహనాలు రానున్నాయని సంకేతాలు ఇచ్చారు. పెట్రోల్‌ బైక్స్‌తో పోలిస్తే కాస్త ధర ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. 110 సీసీ ఇంజిన్‌ సామర్థ్యంతో తీసుకురావొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని