Yellow Muthoottu Draw: కార్లు.. స్కూటర్లు.. బంగారు నాణేలు.. ఎల్లో ముత్తూట్‌ డ్రా!

ముత్తూట్‌ మినీ ఫైనాన్షియర్స్‌ లక్కీ డ్రా కాంటెస్ట్‌ ప్రారంభించింది. కంపెనీలో బంగారు రుణం తీసుకున్నవారు ఈ డ్రాలో కార్లు, ద్విచక్రవాహనాలతో పాటు ఇతర బహుమతులు గెలుచుకోవచ్చు.

Updated : 23 Jan 2023 09:13 IST

(ప్రకటన)

ముంబయి: దేశంలోని ప్రముఖ బ్యాంకింగేతర (NBFC) రుణ సంస్థ ముత్తూట్‌ మినీ ఫైనాన్షియర్స్ (ఎల్లో ముత్తూట్‌)‌.. ‘గోల్డ్‌ లోన్‌ ఉత్సవ్‌’లో భాగంగా తమ కస్టమర్లకు లక్కీ డ్రా కాంటెస్ట్‌ ప్రకటించింది. ముత్తూట్‌ కంపెనీలో బంగారం రుణాలు తీసుకున్న వారు లేదా ఇతర సంస్థల నుంచి తీసుకున్న రుణాలను ముత్తూట్‌ మినీ ఫైనాన్షియర్స్‌కు బదిలీ చేసుకున్న కస్టమర్లు ఈ లక్కీ డ్రా కాంటెస్ట్‌కు అర్హులు. ఇందులో కస్టమర్లు కార్లు, స్కూటర్లు, బంగారు నాణేలు, సైకిళ్లు, ఇతర బహుమతులను గెలుచుకోవచ్చని కంపెనీ తెలిపింది.

ఈ లక్కీ డ్రాకు సంబంధించిన మరింత సమాచారాన్ని ముత్తూట్‌ మినీ ఫైనాన్షియర్స్‌ బ్రాంచీలకు వెళ్లి తెలుసుకోవచ్చు. లేదా 18002700212 టోల్‌ ఫ్రీ నంబరుకు ఫోన్‌ చేసి లేదా వెబ్‌సైట్‌కు వెళ్లి తెలుసుకోవచ్చు. ముత్తూట్‌లో కస్టమర్లకు అనేక రుణ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. తక్షణ రుణ మంజూరు, ఆన్‌లైన్‌ టాప్‌-అప్‌, పార్ట్‌ పేమెంట్‌, వడ్డీ చెల్లింపులో ఆప్షన్లు, రుణం తీసుకున్న మొత్తం కాలానికి ఒకే వడ్డీ రేటుతో ‘రిలాక్స్‌ లోన్‌’, వాయిదాల్లో రుణ మొత్తాన్ని చెల్లించేందుకు వీలుగా ‘సూపర్‌ ఈఎంఐ’ ప్రోగ్రామ్‌ వంటి సేవలను అందిస్తోంది. వీటితో పాటు కస్టమర్లు తమ బంగారు ఆభరణాలను భద్రపర్చుకునేందుకు వీలుగా ‘సేఫ్‌ లాక్‌ గోల్డ్‌ లోన్‌’ను కూడా ప్రారంభించింది. దీనికి బీమా కవరేజ్‌ కూడా ఉంది. ప్రస్తుతం ఈ లాకర్‌ సదుపాయం కొన్ని బ్రాంచీల్లోనే అందుబాటులో ఉండగా.. త్వరలోనే దేశవ్యాప్తంగా విస్తరించనున్నారు.

ఈ సందర్భంగా ముత్తూట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మాథ్యూ మాట్లాడుతూ.. ‘‘కస్టమర్లే ప్రథమ ప్రాధాన్యంగా గొప్ప సేవలను అందించేందుకు మేం కట్టుబడి ఉన్నాం. ఈ లక్కీ డ్రాతో వినియోగదారుల్లో మా సంస్థపై విశ్వాసం పెరగడమే గాక.. కొత్త కస్టమర్లను తీసుకొస్తుందని ఆశిస్తున్నాం. బంగారు రుణాలు తీసుకోవాలనుకునే వారికి ముత్తూట్‌ ఉత్తమ ఎంపికగా ఉండాలనేదే మా ఉద్దేశం’’ అని తెలిపారు.

కంపెనీ సీఈఓ పీఈ మథాయ్‌ మాట్లాడుతూ.. ‘‘గోల్డ్‌ లోన్‌ ఉత్సవ్‌లో భాగంగా ఈ లక్కీ డ్రాను నిర్వహిస్తుండటం ఆనందంగా ఉంది. మా కస్టమర్ల ఆర్థిక అవసరాల్లో మా వంతు సాయం అందించేందుకు హృదయపూర్వకంగా ప్రయత్నిస్తున్నాం. ఈ లక్కీ డ్రా భారీ విజయాన్ని సాధించి మా ప్రియమైన కస్టమర్లతో కొత్త బంధాల అభివృద్ధికి దోహదపడుతుందని మేం విశ్వసిస్తున్నాం’’ అని వెల్లడించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని