YouTube: యూట్యూబ్‌ కోసం యాడ్‌ బ్లాకర్స్‌ వాడుతున్నారా..? నేరుగా వీడియో చివరికే!

YouTube: యాడ్‌ బ్లాకర్స్‌ వినియోగిస్తున్న యూజర్లను అడ్డుకొనేందుకు యూట్యూబ్‌ కొత్త ప్రయత్నం మొదలుపెట్టింది.

Published : 29 May 2024 00:04 IST

YouTube | ఇంటర్నెట్‌డెస్క్‌: యూట్యూబ్‌ (Youtube)లో ప్రకటనలు లేకుండా వీడియోలు చూసేందుకు చాలామంది యాడ్‌ బ్లాకర్స్‌ (ad blockers)ని ఉపయోగిస్తుంటారు. వారిని అడ్డుకొనేందుకు యూట్యూబ్‌ గతేడాదిగా చర్యలు తీసుకుంటోంది. ముందుగా తమ యాడ్‌ బ్లాకర్‌లను నిలిపివేయాలని కోరుతూ సందేశాలు జారీ చేసింది. అయినప్పటికీ వినియోగిస్తే.. మూడు వీడియోల తర్వాత వీడియోలు ప్లే కాకుండా నిలిపివేసింది. ఇప్పుడు మరో ముందడుగు వేసి ఏకంగా వీడియో ప్లే కాకుండా అడ్డుకుంటోంది.

యాడ్‌ బ్లాకర్స్‌ సాయంతో యూట్యూబ్‌లో వీడియోలు ప్లే చేస్తే ఆటోమేటిక్‌గా స్కిప్‌ అవుతాయి. అంటే వీడియోను ప్లే చేయగానే వెంటనే వీడియో ఎండ్‌ అయిపోయినట్లు చూపిస్తుందన్నమాట. దీంతో బ్లాకర్లను వినియోగించేవారు వీడియో చూసే అవకాశం ఉండదు. ఇప్పటికే ఈతరహా అనుభవాలను తాము ఎదుర్కొంటున్నట్లు కొందరు యూజర్లు రెడ్డిట్‌ వేదికగా పంచుకుంటున్నారు. ప్రస్తుతం ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ అవుతోంది. 

జూన్ 14 తర్వాత ఆ ఆధార్‌ కార్డులు పనిచేయవా? ఉడాయ్‌ వివరణ..

ఆదాయాన్ని పెంచుకోవడంలో భాగంగా యూట్యూబ్‌ యాడ్స్‌ను పెంచింది. మొదట 30 సెకన్ల స్కిప్పబుల్‌ బటన్‌తో ప్రకటనల్ని అందించింది. తర్వాత స్కిప్‌ ఆప్షన్‌ లేకుండానే యాడ్స్‌ ఇస్తోంది. దీంతో యాడ్స్‌కు చెక్‌ పెట్టేందుకు కొందరు బ్లాకర్లను వాడుతున్నారు. తమ వేదికపై కంటెంట్‌ అందించే క్రియేటర్లకు ఆదాయం అందించాలంటే యాడ్స్‌ ముఖ్యమంటూ యూట్యూబ్‌ చెబుతోంది. ఒకవేళ యాడ్స్‌తో ఇబ్బంది ఎదుర్కొంటూ ఉంటే ప్రీమియంకు సబ్‌స్క్రైబ్‌ అవ్వాలని సూచిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని