YouTube: భారత్‌లో 22.5 లక్షల వీడియోల తొలగింపు!

భారత్‌లో గతేడాది అక్టోబరు- డిసెంబరు మధ్యకాలంలో ‘యూట్యూబ్‌’ ఏకంగా 22.5 లక్షలకుపైగా వీడియోలను తొలగించింది.

Published : 26 Mar 2024 23:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సంస్థ మార్గదర్శకాలకు (Community Guidelines) విరుద్ధంగా ఉన్న వీడియోలపై ‘యూట్యూబ్‌ (YouTube)’ కొరడా ఝుళిపించింది. భారత్‌లో గతేడాది అక్టోబరు- డిసెంబరు మధ్యకాలం (Q4 2023)లో ఏకంగా 22.5 లక్షలకుపైగా వీడియోలను తొలగించింది. మొత్తం 30 దేశాల జాబితాలో భారత్‌ మొదటిస్థానంలో ఉండగా.. సింగపూర్‌ (12 లక్షలు), అమెరికా (7.8 లక్షలు), ఇండోనేషియా (7.7 లక్షలు), రష్యా (5.1 లక్షలు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 90 లక్షలకుపైగా వీడియోలను తీసేసినట్లు ‘యూట్యూబ్‌ కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ రిపోర్ట్‌’ గణాంకాల్లో వెల్లడైంది.

మహీంద్రా యూనివర్సిటీకి రూ.500కోట్లు.. ప్రకటించిన ఆనంద్‌ మహీంద్రా

అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల యూట్యూబ్‌ ఛానెళ్లపై వేటు పడింది. ఒక ఛానెల్‌ను పక్కన పెట్టినప్పుడు.. అందులోని వీడియోలు కూడా తొలగిపోతాయని నివేదిక తెలిపింది. ఈ లెక్కన 9.5 కోట్లకుపైగా వీడియోలు తొలగిపోయినట్లు చెప్పింది. హానికర, ప్రమాదకర కంటెంట్‌, చిన్నారుల భద్రత, అశ్లీల, హింసాత్మక దృశ్యాలు, తప్పుడు సమాచారం తదితర వీడియోలపై చర్యలు తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. ఈ తరహా 96 శాతం వీడియోలను వినియోగదారులు కాకుండా తొలుత తమ వ్యవస్థలే పసిగట్టినట్లు వెల్లడించింది. వినియోగదారులకు సురక్షితమైన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాంను అందజేసేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని