Zomato: జొమాటోలో పెద్ద ఆర్డర్లకు ప్రత్యేక ఫ్లీట్‌

ఆన్‌లైన్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ జొమాటో కొత్త సేవలకు శ్రీకారం చుట్టింది. పెద్ద పెద్ద ఆర్డర్లకు ప్రత్యేక ఫ్లీట్‌ను ప్రారంభించింది.

Published : 16 Apr 2024 16:02 IST

Zomato | దిల్లీ: ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ జొమాటో (Zomato) మరో కొత్త తరహా సేవలకు శ్రీకారం చుట్టింది. పార్టీలు, చిన్నచిన్న ఈవెంట్లకు ఫుడ్‌ డెలివరీ చేసేందుకు ప్రత్యేక ఫ్లీట్‌ను ప్రారంభించింది. ఇకపై ఎలక్ట్రిక్‌ వాహనాల్లో ఈ ఆర్డర్‌ను డెలివరీ చేయనుంది. ఈమేరకు కంపెనీ సీఈఓ దీపిందర్‌ గోయెల్‌ కొత్త సేవల వివరాలను ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

దేశంలోనే తొలిసారిగా లార్జ్‌ ఆర్డర్‌ ఫ్లీట్‌ను ప్రారంభించినట్లు దీపిందర్‌ గోయల్‌ తెలిపారు. 50 మంది వరకు స్నేహితులు/ కుటుంబసభ్యులతో నిర్వహించుకునే పార్టీలు/ ఈవెంట్లకు ఈ ఫ్లీట్‌ ద్వారా ఫుడ్‌ డెలివరీ చేయనున్నట్లు చెప్పారు. ఇంతకుముందు పెద్దపెద్ద ఆర్డర్లు తీసుకున్నప్పటికీ.. రెగ్యులర్‌ ఫ్లీట్‌ డెలివరీ పార్టనర్లే అందించేవారని చెప్పారు. దీనివల్ల కస్టమర్ల అనుభవం తాము ఆశించిన స్థాయిలో ఉండేది కాదన్నారు. ఈ కొత్త వాహనాలు ఆ సమస్యకు చెక్‌ పెట్టనున్నాయని చెప్పారు.

కౌంటర్‌కు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. UTS యాప్‌తో బుకింగ్ ఎలా..?

ఈ వాహనాలను ఇంకా మెరుగుపరచాల్సి ఉందని గోయల్‌ తెలిపారు. కూలింగ్‌ కంపార్ట్‌మెంట్లు, టెంపరేచర్‌ను సెట్‌ చేసుకునేందుకు వీలుగా హాట్‌ బాక్సులు వంటివి ఏర్పాటుచేయాల్సి ఉందన్నారు. కస్టమర్లు కోరుకున్నట్లుగా ఆహారాన్ని అందించాలన్నదే తమ ఉద్దేశమని పేర్కొన్నారు. గత నెల వెజిటేరియన్‌ ఫుడ్‌ డెలివరీకి ప్రత్యేకంగా ‘వెజ్‌ ఫ్లీట్‌’ను జొమాటో లాంచ్‌ చేసింది. తొలుత వీరికి డ్రెస్‌ కోడ్‌ నిర్ణయించింది. సోషల్‌మీడియాలో వచ్చిన విమర్శల నేపథ్యంలో డ్రెస్‌ కోడ్‌ను తొలగించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని