ఉద్యోగం పోలీసుశాఖలో.. ఊతం ఉగ్రవాదులకు!

జమ్మూకశ్మీర్‌ పోలీసుశాఖలో డీఎస్పీగా పనిచేస్తున్న షేక్‌ ఆదిల్‌ ముష్తాఖ్‌ ఉగ్రవాదులకు సహకరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

Published : 23 Sep 2023 05:19 IST

జమ్మూకశ్మీర్‌లో డీఎస్పీ అరెస్ట్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: జమ్మూకశ్మీర్‌ పోలీసుశాఖలో డీఎస్పీగా పనిచేస్తున్న షేక్‌ ఆదిల్‌ ముష్తాఖ్‌ ఉగ్రవాదులకు సహకరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ గుట్టు బయటపడ్డాక.. అతడిపై దర్యాప్తు చేస్తున్న అధికారిని సైతం ఇందులో ఇరికించాలని ఆదిల్‌ ప్రయత్నించాడు. దీంతో అతణ్ని అరెస్టు చేసిన పోలీసులు శ్రీనగర్‌లో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి ఆరు రోజుల కస్టడీకి తీసుకొన్నారు. గత జులై నెలలో పోలీసులు ఓ ఉగ్రవాదిని అరెస్టు చేశారు. అతడి ఫోను విశ్లేషించి, విచారించగా.. డీఎస్పీ ఆదిల్‌తో తాను నిరంతరం టచ్‌లో ఉన్నట్లు వెల్లడించాడు. చట్టం కన్నుగప్పడంలో డీఎస్పీ తనకు సాయం చేసినట్లు తెలిపాడు. టెలిగ్రామ్‌ యాప్‌ ద్వారా ఆదిల్‌ ఆ ఉగ్రవాదితో మాట్లాడటం, సందేశాలు పంపడం వంటివి చేసినట్లు సీనియర్‌ అధికారులు గుర్తించారు. ‘‘డీఎస్పీకి, ఉగ్రవాదికి మధ్య 40 ఫోన్‌కాల్‌ సంభాషణలు జరిగాయి. అరెస్టును తప్పించుకోవడం, న్యాయసాయం పొందడంపై డీఎస్పీ అతడికి సలహాలు ఇస్తున్నాడు’’ అని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీనియర్‌ అధికారి వెల్లడించారు. లష్కరే తొయిబాకు నిధులు సేకరించే ముజ్మిల్‌ జహూర్‌తో డీఎస్పీ ఆదిల్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. అతడిని అరెస్టు నుంచి తప్పించిన ఆదిల్‌.. ఉగ్రవాదుల వద్ద రూ.5 లక్షలు తీసుకొన్నట్లు తేలింది. ట్విటర్‌లో చురుగ్గా ఉండే ఆదిల్‌కు ఏకంగా 44 వేల మంది ఫాలోవర్లు ఉండటం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని