అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం వికారాబాద్‌ జిల్లా పరిగి మండలంలో చోటుచేసుకుంది.

Published : 23 Sep 2023 05:17 IST

పరిగి గ్రామీణ, న్యూస్‌టుడే: అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం వికారాబాద్‌ జిల్లా పరిగి మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం.. రాపోల్‌ గ్రామానికి చెందిన నల్లోల్ల నర్సింహులు(32) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇటీవల పొలాన్ని చదును చేయించి బోరు తవ్వించారు. అందులోని అరెకరంలో వరి, ఎకరంన్నరలో పత్తి పంటలు సాగు చేశారు. అందుకోసం రూ.4 లక్షల వరకు అప్పులయ్యాయి. ఇటీవలి వర్షాలకు పత్తి మొక్కలు ఎరుపుగా మారాయి. దీంతో పంట చేతికి రాదని, అప్పులు ఎలా తీర్చాలని కొంతకాలంగా ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం భార్య పొలానికి వెళ్లిన తర్వాత ఇంట్లో పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానికులు, కుటుంబసభ్యులు గమనించి ఆయన్ను చికిత్స కోసం వికారాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మరణించారు. నర్సింహులుకు భార్య కొమ్రమ్మ, కుమార్తె వర్షిత, కుమారుడు నాని ఉన్నారు. రైతు ఆత్మహత్యపై తమకు ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని