ఝార్ఖండ్‌లో స్కూల్‌ బస్సు బోల్తా.. 15 మంది చిన్నారులకు గాయాలు

ఝార్ఖండ్‌లోని రాంచీలో చిన్నారులతో పాఠశాలకు వెళుతున్న ఓ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మంది విద్యార్థులు గాయపడ్డారు. వీరందరినీ ఆసుపత్రికి తరలించారు.

Published : 28 Apr 2024 04:34 IST

రాంచీ: ఝార్ఖండ్‌లోని రాంచీలో చిన్నారులతో పాఠశాలకు వెళుతున్న ఓ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మంది విద్యార్థులు గాయపడ్డారు. వీరందరినీ ఆసుపత్రికి తరలించారు. రాంచీలోని మందర్‌లో సెయింట్‌ మరియా పాఠశాలకు వంద మీటర్ల దూరంలో శనివారం ఉదయం ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనా సమయంలో బస్సులో 30 చిన్నారులు ఉన్నారు. రోజుకంటే 45 నిమిషాలు ఆలస్యంగా రావడంతో డ్రైవర్‌ బస్సును ఫోను మాట్లాడుతూ వేగంగా నడిపారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. కాగా బస్సు డ్రైవర్‌ పరారీలో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు