జమ్మూకశ్మీర్‌లో కాల్పులు.. గ్రామ రక్షక భటుడి మృతి

జమ్మూకశ్మీర్‌లోని ఉధంపుర్‌ జిల్లాలో మారుమూల గ్రామమైన పనారాలో కాల్పులు కలకలం సృష్టించాయి.

Published : 29 Apr 2024 04:46 IST

జమ్ము: జమ్మూకశ్మీర్‌లోని ఉధంపుర్‌ జిల్లాలో మారుమూల గ్రామమైన పనారాలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఆదివారం తెల్లవారుజామున గ్రామంలో పహారా కాస్తున్న పోలీసులు, గ్రామ రక్షక భటుల (విలేజ్‌ డిఫెన్స్‌ గార్డ్స్‌) బృందానికి ఉగ్రవాదులు ఎదురుపడటంతో ఇరు వర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి ఈ ఘటనలో మొహద్‌ షరీఫ్‌ అనే గ్రామ రక్షక భటుడు ప్రాణాలు కోల్పోయారు. అరగంట పాటు కాల్పులు చోటు చేసుకోగా.. భద్రతా సిబ్బంది కళ్లుగప్పి ఉగ్రవాదులు అడవుల్లోకి పారిపోయారు. వారి కోసం పోలీసులు, సైన్యం, సీఆర్పీఎఫ్‌ సిబ్బంది సంయుక్తంగా ముమ్మర గాలింపు చర్యలను చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఉగ్రవాదులు ఇటీవలే పాకిస్థాన్‌ వైపు నుంచి చొరబడినట్లు సమాచారం ఉందని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని