మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ కేసు.. బాలీవుడ్‌ నటుడు సాహిల్‌ ఖాన్‌ అరెస్ట్‌

మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ కుంభకోణం కేసులో బాలీవుడ్‌ నటుడు, ఫిట్‌నెస్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ సాహిల్‌ ఖాన్‌ను ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Published : 29 Apr 2024 04:47 IST

ముంబయి: మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ కుంభకోణం కేసులో బాలీవుడ్‌ నటుడు, ఫిట్‌నెస్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ సాహిల్‌ ఖాన్‌ను ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సైబర్‌ విభాగానికి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ఆయన్ను ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పుర్‌లో  అరెస్టు చేసింది. ఈ కేసులో సాహిల్‌ ఖాన్‌కు గతేడాది డిసెంబరులో సిట్‌ సమన్లు జారీ చేసింది. వీటికి గైర్హాజరయిన ఆయన కేసుతో తనకెలాంటి సంబంధం లేదని, తాను కేవలం యాప్‌కు ప్రచారకర్తగా మాత్రమే వ్యవహరించానని ఆరోపిస్తూ ముందస్తు బెయిల్‌ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు దర్యాప్తు బృందం సాహెల్‌ను యాప్‌ సహ-యజమానిగా పేర్కొంది. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం సాహెల్‌కు ముందస్తు బెయిల్‌ను నిరాకరిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘బెట్టింగ్‌ యాప్‌ కార్యకలాపాలన్నీ అక్రమం. చాలా పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారింది. నకిలీ బ్యాంకు ఖాతాలను సృష్టించారు. ఫేక్‌సిమ్‌ కార్డులతో సంప్రదింపులు జరిపారు.  పిటిషన్‌దారుకు ‘ది లయన్‌ బుక్‌247’తో నేరుగా సంబంధం ఉన్నట్లు తేలింది’’ అని ధర్మాసనం పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని