Hyderabad: ‘మార్కెట్‌ బాక్స్‌ యాప్‌’ పేరుతో మోసం.. తొలిసారి భారీగా నగదు రికవరీ

మార్కెట్‌ బాక్స్‌ యాప్‌ ద్వారా పెట్టుబడులు, ట్రేడింగ్‌ పేరుతో రూ.కోట్లు కొల్లగొడుతున్న రాజస్థాన్,

Updated : 29 Aug 2022 13:38 IST

హైదరాబాద్: మార్కెట్‌ బాక్స్‌ యాప్‌ ద్వారా పెట్టుబడులు, ట్రేడింగ్‌ పేరుతో రూ.కోట్లు కొల్లగొడుతున్న రాజస్థాన్, యూపీకి చెందిన నలుగురు సైబర్ నేరగాళ్లను సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నలుగురు నిందితుల నుంచి రూ.9.81కోట్ల నగదు రికవరీ చేసినట్లు సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర వెల్లడించారు. ఇంత పెద్ద మొత్తంలో నగదు రికవరీ చేయడం ఇదే మొదటిసారి అని సీపీ తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీపీ మీడియాకు వివరించారు.

‘‘మార్కెట్‌ బాక్స్‌ యాప్‌ ద్వారా వ్యాపారం, పెట్టుబడి పేరుతో అమాయకులను మోసం చేస్తున్నారు. 10 మంది సభ్యుల ముఠాలో నలుగురిని అరెస్టు చేశాం. పెట్టుబడులకు రెట్టింపు లాభాలు ఇస్తామని నమ్మించారు. ఒక వ్యక్తి రూ.62లక్షలు పెట్టుబడి పెట్టి రూ.34 లక్షలు నష్టపోయారు. దాదాపు 3వేల మంది ఈ యాప్‌లో సభ్యత్వం తీసుకున్నారు. కాగా, మార్కెట్‌ బాక్స్‌ యాప్‌ సెబీలో నమోదు కాలేదు’’ అని సీపీ వెల్లడించారు. బ్యాంకులు, పెట్టుబడి సంస్థల పేరుతో ఫోన్‌, మెయిల్‌కు వచ్చే సందేశాలను నమ్మొద్దని ప్రజలకు సీపీ సూచించారు. అధిక లాభాలకు ఆశపడి మోసపోవద్దని చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని