Crime: కన్నతల్లిపై ఓ న్యాయవాది కర్కశత్వం

న్యాయవాదిగా పని చేస్తున్న ఓ వ్యక్తి తల్లిని చిత్ర హింసలకు గురిచేశాడు. దీంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 

Published : 29 Oct 2023 17:30 IST

చండీగఢ్‌: వృద్ధాప్యంలో ఉన్న తల్లికి అండగా నిలవాల్సిన కుమారుడే ఆమె పాలిట రాక్షసంగా ప్రవర్తించాడు.  తోటి కుటుంబ సభ్యులతో కలిసి ఆమెను చిత్రహింసలకు గురిచేశాడు. ఈ ఘటన పంజాబ్‌ (Punjab)లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..

రూప్‌నగర్‌లో నివాసముంటున్న అంకుర్‌ వర్మ న్యాయవాదిగా పనిచేస్తున్నాడు. ఇటీవల అతడి తండ్రి గుండెపోటుతో మరణించారు. మరోవైపు అంకుర్‌ తల్లి మానసిక స్థితి కూడా బాగోలేదు. అయితే అతడి కుటుంబ సభ్యులు తరచూ ఆ వృద్ధురాలిని వేధించడం మొదలుపెట్టారు. అంకుర్‌ కుమారుడు తన నానమ్మ బయటకు వెళ్లిన సమయంలో.. ఆమె బెడ్‌పై నీరు పోశాడు. పైగా ఆ వృద్ధురాలిపై తండ్రికి ఫిర్యాదు చేశాడు.

ప్రాణాలు పోతున్నా.. 48 మందిని కాపాడాడు

దీంతో ఆగ్రహానికి గురైన అంకుర్‌ విచక్షణ కోల్పోయి తల్లిపై దాడికి దిగాడు. ఆమెను తీవ్రంగా గాయపర్చాడు. ఆ తర్వాత అంకుర్‌ సోదరి దీప్షిఖా తల్లిని చూసేందుకు వచ్చింది. ఆ వృద్ధురాలి ఆరోగ్య పరిస్థితి చూసి అనుమానంతో గదిలో ఉన్న సీసీటీవీ పరిశీలించడంతో విషయం తెలిసింది. దీంతో దీప్షిఖా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు