Crime: అత్యాచారం చేసి.. కాల్చిన ఇనుప రాడ్డుతో ముఖంపై పేరు రాసి..

ఓ వ్యక్తి మైనర్‌ను బంధించి అత్యాచారం చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఖేరీ  జిల్లాలో చోటు చేసుకుంది.

Updated : 28 Apr 2024 20:15 IST

లఖ్‌నవూ: ఓ వ్యక్తి  మైనర్‌ను మూడు రోజుల పాటు బంధించి అత్యాచారం చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ఖేరీ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా ఉంటున్న అమన్‌(22) అనే యువకుడు.. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని ఓ బాలిక వెంట పడ్డాడు. ఆ ప్రతిపాదనను తిరస్కరించడంతో కోపోద్రిక్తుడైన అతడు ఆమెను బంధించి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా కాల్చిన ఇనుప రాడ్డుతో బాలిక ముఖంపై తన పేరు రాశాడు. అనంతరం బాలిక అతడి నుంచి తప్పించుకుంది. అపస్మారక స్థితిలో ఉన్న మైనర్‌ను గుర్తించిన స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. బాలిక కుటంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు