Nalgonda: శిశు విక్రయానికి డాక్టర్ మధ్యవర్తిత్వం
విచారణలో మరో వ్యవహారం వెలుగులోకి
రూ.4.50 లక్షలకు మగ శిశువు అమ్మకం
మొత్తం ఏడుగురి అరెస్టు: ఎస్పీ శరత్‌చంద్ర

ఈనాడు, నల్గొండ; నల్గొండ నేరవిభాగం, న్యూస్‌టుడే: శిశువుల విక్రయాల వ్యవహారంలో ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు నల్గొండ ఎస్పీ శరత్‌చంద్ర పవార్ తెలిపారు. బుధవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. నల్గొండ పోలీసులు రెండు రోజుల నుంచి ఆడ శిశువు విక్రయంపై ముమ్మర దర్యాప్తు చేస్తుంటే ఇంకో మగ శిశువు విక్రయ ముఠా ఆగడాలు వెలుగులోకి వచ్చాయని వివరించారు. వారి నుంచి రూ.20 వేల నగదుతోపాటు ఏడు సెల్‌ఫోన్లు, ఒప్పంద పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎస్పీ తెలిపిన వివరాలివీ...
కుర్ర బాబు, భార్య పార్వతి ప్రస్తుతం నల్గొండ బీటీఎస్‌లో నివాసం ఉంటున్నారు. ఐదోసారి గర్భం దాల్చిన పార్వతిని.. బాబు హాలియాలోని నిర్మల ఆసుపత్రిలో చేర్చారు. ఈసారి కూడా ఆడ శిశువు పుట్టడంతో పోషించలేమని బాబు.. ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యురాలు శాంతిప్రియ దృష్టికి తీసుకెళ్లాడు. ఆమె మధ్యవర్తిత్వం వహించి ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరుకు చెందిన సాంబమూర్తి, రజిత దంపతులకు సమాచారం అందించారు. వారు రూ.2.30 లక్షలకు బేరం కుదుర్చుకుని శిశువును తీసుకెళ్లారు. సాంబమూర్తి ఏలూరులో వార్డు ఎమినిటీ సెక్రటరీగా పనిచేస్తున్నారు. కుర్ర బాబును, ఈ దంపతులను రిమాండ్‌కు తరలించారు. డాక్టర్ శాంతిప్రియను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకొని విచారించి అరెస్టు చేశారు. ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్ చేసి ఆమె ఈ సెప్టెంబరు నుంచి హాలియాలోని నిర్మల ఆసుపత్రిలో డ్యూటీ డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
నల్గొండ కేసును విచారిస్తున్న సమయంలో ఓ మగ శిశువును రూ.4.50 లక్షలకు విక్రయించిన విషయం వెలుగులోకి వచ్చింది. గుర్రంపోడు మండలం కోనాయిగూడెం గ్రామానికి చెందిన ఒర్సు శ్రీను, సుజాత దంపతులకు ముగ్గురు పిల్లలున్నారు. ఆరేళ్ల క్రితం ఒడిశాలో మట్టి పనికి వెళ్లిన అతను అక్కడ మమత అనే మహిళను రెండో వివాహం చేసుకోగా వారికి ఒక పాప పుట్టింది. రెండోసారి ఎనిమిది నెలల గర్భవతిగా ఉన్న సమయంలో మమతను సొంత గ్రామానికి తీసుకొచ్చాడు. పుట్టబోయే బిడ్డను విక్రయించాలని కనగల్ మండలం బొమ్మాయిపల్లికి చెందిన స్నేహితుడు శ్రీనుకు చెప్పాడు. దీంతో అతడు అదే గ్రామానికి చెందిన పిల్లలు లేని వేముల నాగరాజు, సువర్ణ దంపతులకు సమాచారం ఇచ్చాడు. ఈ నెల 8న జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రిలో మమతకు మగ శిశువు జన్మించాడు. ఈ నెల 15న శిశువును రూ.6 లక్షలకు అమ్మకానికి పెట్టి రూ.4.50 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని నగదుతో ఒడిశాకు వెళ్లారు. శిశువును కొన్న నాగరాజు, సువర్ణలతోపాటు మధ్యవర్తి శ్రీనును రిమాండ్‌కు తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

రహదారులపై రక్తధారలు
సాఫీగా సాగాల్సిన ప్రయాణాల్లో అనూహ్య ప్రమాదాలు... నెత్తుటి ధారలతో తడిచిన రహదారులు... ఆత్మీయులను కోల్పోయిన కుటుంబసభ్యుల రోదనలు... వెరసి రాష్ట్రంలో సోమవారం చోటుచేసుకున్న మూడు వేర్వేరు ప్రమాదాలు ఏడుగురిని పొట్టన పెట్టుకోగా 23 మంది గాయపడ్డారు. - 
                                    
                                        

నకిలీ మద్యం కేసులో మరో నలుగురు నిందితులు
నకిలీ మద్యం కేసులో దర్యాప్తులో పలువురి పాత్రపై ఆధారాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో నిందితుల జాబితా పెరుగుతోంది. ప్రస్తుతం నిందితుల సంఖ్య 23కు చేరింది. - 
                                    
                                        

ప్రియుడిపై దాడిచేసి.. యువతిపై సామూహిక అత్యాచారం
ప్రేమజంట కారులో కూర్చొని మాట్లాడుకుంటుండగా అక్కడకు వచ్చిన దుండగులు యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. - 
                                    
                                        

కొత్త ఫోన్ కోసం వచ్చి...
వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం లక్ష్మీనారాయణపూర్‌లో నివాసముంటున్న గుర్రాల శ్రీనివాస్‌రెడ్డి కుమార్తె అఖిలారెడ్డి గచ్చిబౌలిలోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఎంబీఏ చదువుతున్నారు. - 
                                    
                                        

గుంతలో పడి చిన్నారి మృతి
అభం... శుభం... తెలియని ఓ చిన్నారి అనుకోని పరిస్థితిలో అసువులు బాశాడు. విద్యాబుద్ధులు నేర్చుకుందామని అంగన్వాడీ కేంద్రానికి వెళ్లిన నాలుగేళ్ల చిన్నారిని ప్రమాదకర నీటిగుంత పొట్టన పెట్టుకుంది. - 
                                    
                                        

నాడు పెనుకొండలోనూ ఇదే తరహా ప్రమాదం
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద సోమవారం జరిగిన ప్రమాదం... పదేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా పెనుకొండ స్టేషన్ సమీపంలో జరిగిన దుర్ఘటన ఒకే తరహాలో ఉన్నాయి. - 
                                    
                                        

అక్షర దీపికలు... ఇక కానరారు!
తండ్రి కారు డ్రైవర్. తల్లి గృహిణి. వారి ఆకాంక్షను నెరవేర్చేందుకు తాండూరులో నివాసముంటున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు సాయిప్రియ, నందిని, తనూషలు చిన్నప్పటి నుంచి పట్టుదలగా చదివారు. - 
                                    
                                        

రాజస్థాన్‌లో డంపర్ ట్రక్కు డ్రైవర్ బీభత్సం
నియంత్రణ కోల్పోయిన ఓ డంపర్ ట్రక్కు డ్రైవర్ 14 మంది మృతికి కారణమయ్యాడు. దాదాపు 300 మీటర్ల మేర 17కి పైగా వాహనాలను ఢీకొంటూ వెళ్లి మరో 13 మందిని గాయపరిచాడు. - 
                                    
                                        

ఆన్లైన్ బెట్టింగ్‌లతో అప్పులు.. తుపాకీతో కాల్చుకొని కానిస్టేబుల్ బలవన్మరణం
సంగారెడ్డి పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కొఠారి సందీప్‌కుమార్(23) పట్టణ శివారులోని మహబూబ్‌సాగర్ కట్టపై తుపాకీతో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడారు. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

మంత్రి అజారుద్దీన్‌కు శాఖల కేటాయింపు
 - 
                        
                            

నాకు ఏం జరిగిందో గుర్తులేదా..? థరూర్‌ను హెచ్చరించిన భాజపా నేత
 - 
                        
                            

లాలూ తాతలు దిగొచ్చినా.. ఆ సొమ్ము దోచుకోలేరు: అమిత్ షా
 - 
                        
                            

చాట్‌జీపీటీ గో ఫ్రీ ప్లాన్ .. ఎలా పొందాలంటే?
 - 
                        
                            

వివేకా హత్య కేసు.. సీబీఐ కోర్టులో సునీల్‌యాదవ్ కౌంటర్ దాఖలు
 - 
                        
                            

ప్రపంచంలో నెక్ట్స్ సూపర్ పవర్‌గా భారత్: ఫిన్లాండ్ అధ్యక్షుడు
 


