Praneeth Rao: ప్రణీత్‌రావు రిమాండ్‌ రిపోర్టులో కీలక విషయాలు

స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ)లో ఆధారాల ధ్వంసం కేసుకు సంబంధించి మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలు పేర్కొన్నారు.

Published : 15 Mar 2024 13:38 IST

హైదరాబాద్‌: స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ)లో ఆధారాల ధ్వంసం కేసుకు సంబంధించి మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలు పేర్కొన్నారు. నిందితుడు 3 రకాల నేరాలకు పాల్పడినట్లు గుర్తించారు. సాక్ష్యాల చెరిపివేత, ప్రజా ఆస్తుల ధ్వంసం, ఎలక్ట్రానిక్‌ ఎవిడెన్స్‌ టాంపరింగ్‌కు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. 17 కంప్యూటర్ల ద్వారా ఫోన్ల ట్యాపింగ్‌ చేసినట్లు వెల్లడించారు. డిసెంబర్‌ 4న రాత్రి కట్టర్లు ఉపయోగించి పాత హార్డ్‌ డిస్కులు ధ్వంసం చేయడంతో పాటు సంవత్సరాల తరబడి రహస్యంగా సేకరించిన డేటా మొత్తాన్ని ఎన్నికల ఫలితాల రోజు చెరిపేసినట్లు పేర్కొన్నారు. 

ప్రణీత్‌రావు కేసులో ఆరుగురు సభ్యులతో టీమ్‌ను ఉన్నతాధికారులు ఏర్పాటు చేశారు. విచారణాధికారిగా జూబ్లీహిల్స్‌ ఏసీపీ, సభ్యులుగా బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, ఫిలింనగర్‌, పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్‌, ఎస్సైలు ఉన్నారు. నిందితుడి నుంచి మూడు సెల్ ఫోన్లతో పాటు లాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని