ఘోరం.. బస్సుపై తెగిపడిన కరెంటు తీగ.. ప్రయాణికుల సజీవదహనం

Bus Accident: హైటెన్షన్‌ వైరు పడటంతో బస్సుకు నిప్పంటుకున్న ఘటన యూపీలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురు సజీవ దహనమయ్యారు.

Updated : 11 Mar 2024 16:44 IST

గాజీపుర్‌: ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttar Pradesh)లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గాజీపుర్‌ జిల్లాలో పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సుపై హైటెన్షన్‌ కరెంట్‌ వైరు (High Tension Wire) తెగి పడింది. దీంతో బస్సుకు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో పలువురు సజీవ దహనమైనట్లు అధికారులు వెల్లడించారు.

ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటల్లో బస్సు పూర్తిగా కాలిపోయింది. ఘటన సమయంలో బస్సులో దాదాపు 35  మంది ప్రయాణికులున్నారు. ఇప్పటివరకు ఆరుగురి మృతదేహాలను వెలికి తీశారు. తీవ్రంగా కాలిన గాయాలపాలైన మరో 10 మందిని ఆసుపత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు అవసరమైన సాయం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50వేల చొప్పు ఆర్థికసాయం అందిస్తామని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు