Crime News: సంగారెడ్డి ‘సూట్‌కేసు’ మర్డర్ కేసులో దోషికి జీవిత ఖైదు

2019లో సంచలనం సృష్టించిన సూట్ కేసు మర్డర్ కేసులో నిందితుడు సునీల్‌ కుమార్‌కు సంగారెడ్డి కోర్టు జీవిత ఖైదు విధించింది.

Updated : 31 Jul 2023 19:36 IST

సంగారెడ్డి: ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 2019లో సంచలనం సృష్టించిన సూట్ కేసు మర్డర్ కేసులో నిందితుడు సునీల్‌ కుమార్‌కు సంగారెడ్డి కోర్టు జీవిత ఖైదు విధించింది. 2019 ఏప్రిల్‌లో రామచంద్రాపురంలో నమోదైన ఈ కేసుకు సంబంధించి తాజాగా కోర్టు తీర్పు వెలువరించింది.

అసలేం జరిగిందంటే?

తనతో పాటు ఇంజినీరింగ్ చదివే లావణ్యను ప్రేమ పేరుతో మోసం చేసిన సునీల్ కుమార్.. పెళ్లి చేసుకుంటానని ఆమె తల్లిదండ్రులను సైతం నమ్మించాడు. తనతో పాటు మస్కట్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని తీసుకొచ్చి.. శంషాబాద్ విమానాశ్రయంలో లావణ్యను హత్య చేశాడు. ఆమె మృతదేహాన్ని సూట్ కేసులో ప్యాక్ చేసి, సూరారం డ్రైనేజీలో పడేశాడు. అనంతరం మస్కట్ నుంచి లావణ్య తిరిగి వస్తుందని ఆమె తల్లిదండ్రులను నమ్మించే ప్రయత్నం చేశాడు. లావణ్య ఫోన్‌లో స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన తండ్రి శ్రీనివాస్‌.. ఆర్‌సీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి.. ఆధారాలను కోర్టుకు సమర్పించారు. ఘటనపై విచారణ చేపట్టిన కోర్టు నిందితుణ్ని దోషిగా తేల్చింది. అతనికి జీవిత ఖైదుతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని