logo

సాయంత్రం ఈదురుగాలులతో అతలాకుతలం

భైంసా, కుభీరు, కుంటాల మండలాల్లోని ఆయా గ్రామాల్లో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. తీవ్రగాలులతో రేకుల ఇళ్లు, షెడ్డుల పైకప్పులు ఎగిరిపోయాయి.

Published : 23 Apr 2024 02:32 IST

భైంసాలో తెగిపడిన విద్యుత్తు తీగలు

భైంసా, కుభీరు, లోకేశ్వరం, కుంటాల, ముథోల్‌, న్యూస్‌టుడే : భైంసా, కుభీరు, కుంటాల మండలాల్లోని ఆయా గ్రామాల్లో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. తీవ్రగాలులతో రేకుల ఇళ్లు, షెడ్డుల పైకప్పులు ఎగిరిపోయాయి. చెట్లు విరిగి, విద్యుత్తు తీగలు రహదారులపై తెగిపడ్డాయి. విద్యుత్తు అధికారులు, సిబ్బంది వెంటనే తీగలను తొలగించారు. ఫలితంగా పలు గ్రామాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. సంబంధిత అధికారులు పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అరగంటపాటు కురిసిన వర్షంతో కాలువలు పొంగి మురుగు రహదారులపై ప్రవహించింది. మరోవైపు కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం, మక్కలు, చేలలో కోసిన నువ్వు పంట కుప్పలకు నష్టం వాటిల్లినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. లోకేశ్వరం మండలంలోని అబ్దుల్లాపూర్‌, కన్కాపూర్‌, జోహార్‌పూర్‌, వాస్తాపూర్‌ గ్రామాల్లో  కురిసిన వర్షం రైతులను ఆందోళనకు గురి చేసింది.  ముథోల్‌లో బలమైన ఈదురుగాలులతో తహసీల్దార్‌ కార్యాలయ సమీపంలో విద్యుత్తు నియంత్రికతోపాటు విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. సాయంత్రం అయిదు గంటల నుంచి విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. విద్యుత్తు సరఫరాకు చర్యలు తీసుకుంటున్నట్లు ముథోల్‌ డిస్కం ఏఈ శ్రీకాంత్‌ తెలిపారు.

భైంసాలో గాలికి ఎగిరిపడ్డ ఓ షెడ్డు పైకప్పు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని