logo

ఉత్సాహంగా జిల్లా స్థాయి క్రికెట్ ఎంపిక పోటీలు

జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో ఆదివారం హైదరాబాద్ క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రికెట్ ఎంపిక పోటీలు ఉత్సాహంగా సాగాయి.

Published : 28 Apr 2024 12:07 IST

ఆదిలాబాద్‌ క్రీడావిభాగం: జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో ఆదివారం హైదరాబాద్ క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రికెట్ ఎంపిక పోటీలు ఉత్సాహంగా సాగాయి. అండర్-14, 16, 19, 23 విభాగం వారీగా వేర్వేరుగా నిర్వహించిన పోటీల్లో క్రీడాకారులు ఎంపికే లక్ష్యంగా మైదానంలో శ్రమించారు. అంతకుముందు ముఖ్య అతిథిగా హాజరైన సీనియర్ క్రీడాకారుడు అతవుల్లా ఖాన్ మాట్లాడుతూ క్రమశిక్షణ ఉంటే ఏ ఆటలోనైనా ఉన్నత లక్ష్యాలను చేరుకోవచ్చని, పోటీల్లో క్రీడా స్ఫూర్తి తప్పనిసరి అని సూచించారు. ఈ కార్యక్రమంలో నిర్వహణ సహాయకులు గౌతం, విజయ్ కుమార్ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని