logo

57 మంది అధ్యాపకులకు నోటీసులు

ఇంటర్‌ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం తగ్గడంపై ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ దృష్టి సారించింది. జిల్లాలోని 10 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో జనరల్‌, వొకేషనల్‌ విభాగంలో ప్రథమ సంవత్సరంలో 29.28 శాతం,

Published : 29 Apr 2024 02:26 IST

మంచిర్యాల విద్యావిభాగం, న్యూస్‌టుడే: ఇంటర్‌ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం తగ్గడంపై ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ దృష్టి సారించింది. జిల్లాలోని 10 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో జనరల్‌, వొకేషనల్‌ విభాగంలో ప్రథమ సంవత్సరంలో 29.28 శాతం, ద్వితీయ సంవత్సరంలో 46.98 శాతం ఉత్తీర్ణత నమోదైన నేపథ్యంలో విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఫెయిల్‌ కావడానికి కారణాలను అన్వేషిస్తూ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఆయా సబ్జెక్టుల్లో బోధించే 57 మంది అధ్యాపకులకు షోకాజ్‌ నోటీసులు జారీచేశారు. మూడ్రోజుల్లోగా సంబంధిత అధ్యాపకులు ఫలితాలపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని