logo

నేడు, రేపు ఓటర్ల ప్రత్యేక నమోదు

రాష్ట్ర ఎన్నికల అధికారి ఆదేశానుసారం ఈ నెల 3, 4 తేదీల్లో ఓటర్ల ప్రత్యేక నమోదు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌ఓ) దయానిధి తెలిపారు.

Published : 03 Dec 2022 00:58 IST

రాజకీయ పార్టీల ప్రతినిధులతో డీఆర్‌వో దయానిధి

పాడేరు, న్యూస్‌టుడే: రాష్ట్ర ఎన్నికల అధికారి ఆదేశానుసారం ఈ నెల 3, 4 తేదీల్లో ఓటర్ల ప్రత్యేక నమోదు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌ఓ) దయానిధి తెలిపారు. దీనిపై కలెక్టరేట్‌లో శుక్రవారం వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. డీఆర్‌ఓ మాట్లాడుతూ ఈ రెండు రోజుల్లో జిల్లాలో 1,008 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటరు నమోదు ప్రక్రియ జరుగుతుందన్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బూత్‌ స్థాయి అధికారులంతా పోలింగ్‌ కేంద్రాల వద్ద అందుబాటులో ఉండాలని చెప్పారు. యువ ఓటర్లు, ఆదిమ జాతులుండే గ్రామాల్లో ప్రత్యేక సర్వే చేపట్టి నూరుశాతం ఓటరు నమోదుకు కృషి చేయాలన్నారు. ముసాయిదా జాబితాలో మృతులు, రెండుసార్లు నమోదులు ఎక్కువగా కనిపిస్తున్నట్లు పేర్కొన్నారు.  వైకాపా, తెదేపా, భాజపా, సీపీఐ, సీపీఎం ప్రతినిధులు, తహసీల్దార్లు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని