logo

రోడ్డు లేక ఇబ్బందులు

అనంతగిరి మండలంలోని మారుముల చీడివలస, పాటిపల్లి, పట్టం, బందకొండ గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని గిరిజనులు సోమవారం నిరసన చేపట్టారు.

Published : 23 Apr 2024 02:52 IST

రహదారి పనులు చేపట్టాలని గిరిజనుల ఆందోళన

అనంతగిరి, న్యూస్‌టుడే: అనంతగిరి మండలంలోని మారుముల చీడివలస, పాటిపల్లి, పట్టం, బందకొండ గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని గిరిజనులు సోమవారం నిరసన చేపట్టారు. ఆయా గ్రామాలకు రహదారి పనులు సగంలోనే నిలిపేశారని, వీటిని పూర్తి చేయాలని కోరారు. పెదకోట పంచాయతీ పరిధిలోని పట్టాం నుంచి చీడివలస వరకు, పాటిపల్లి నుంచి బందకొండ వరకు పనులు చేపట్టకుండా నిధులు డ్రా చేశారని ఆరోపించారు. రోడ్డు సదుపాయం లేక సుమారుగా 519 గిరిజన కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయన్నారు. అత్యవసర పరిస్థితుల్లో డోలీమోతలే దిక్కవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. రహదారి పనులు ప్రారంభించకపోతే జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని గిరిజన సంఘం నాయకులు కె.గోవిందరావు హెచ్చరించారు.

రహదారి పనులకు కంకర సిద్ధంగా ఉందని, మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా ఇటీవల పనులు నిలిపివేశారని ఏఈ గణేష్‌ తెలిపారు. ప్రస్తుతం ఆయా రహదారుల పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని